Page Loader
ఉప్పుడు బియ్యంపై భారతదేశం 20% ఎగుమతి సుంకం 
ఉప్పుడు బియ్యంపై భారతదేశం 20% ఎగుమతి సుంకం

ఉప్పుడు బియ్యంపై భారతదేశం 20% ఎగుమతి సుంకం 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 26, 2023
12:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉప్పుడు బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా వీటి ధరలను అదుపులో ఉంచడమే కాకుండా,నిల్వలను కూడా సరిపడా అందుబాటులో ఉంచటం కోసం ఎగుమతులపై 20 శాతం ఎక్స్పోర్ట్ డ్యూటీ ని విధించింది. ఈ మేరకు ఫైనాన్స్ మినిస్ట్రీ తాజాగా నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది. ఆగస్టు 25 నుంచే ఈ సుంకం అమల్లోకి వచ్చింది. ఈ ఏడాది అక్టోబరు 16 వరకు ఈ నిబంధన కొనసాగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే, ఎల్‌ఈవో (లెట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్)జారీ కానప్పటికీ ఇప్పటికే కస్టమ్స్‌ పోర్టుల్లో లోడ్‌ చేసి ఉంచిన ఉప్పుడు బియ్యానికి ఈ ఎక్స్పోర్ట్ డ్యూటీ వర్తించదని ఫైనాన్స్ మినిస్ట్రీ తెలిపింది.

Details 

బాస్మతియేతర రకాల ఎగుమతులపై కేంద్రం నిషేధం

దాంతో పాటు సరైన లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఉన్న ఎక్స్పోర్ట్ లకు కూడా సుంకం నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇటీవల బాస్మతీయేతర బియ్యం ఎక్స్పోర్ట్ ల పై కేంద్రం నిషేధం అమలు చేయడంతో.. ఉప్పుడు బియ్యానికి డిమాండ్‌ పెరిగింది. ఫలితంగా వీటి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ సందర్బంగా దేశీయంగా పార్‌బాయిల్డ్‌ రైస్‌ నిల్వలను తగినంతగా అందుబాటులో ఉంచడంతో పాటు, రిటైల్‌ ధరలను కంట్రోల్ చేసేందుకు కేంద్రం ఈ సుంకం విధించింది. మన దేశ బియ్యం ఎక్స్పోర్ట్స్ లో బాస్మతియేతర తెల్ల బియ్యం షేర్ 25శాతంగా ఉంటోంది. అలాగే, దేశీయంగా బియ్యం రేట్ లు పెరుగుతున్న నేపథ్యంలో గత నెల బాస్మతియేతర రకాల ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది.

Details 

సంవత్సరం వ్యవధిలో 11.5 శాతం మేర పెరిగిన బియ్యం రేట్లు 

పాక్షికంగా మరపట్టిన, పూర్తిగా మరపట్టిన, పాలిష్‌ చేయని తెల్ల బియ్యం ఎక్స్పోర్ట్స్ పై ఈ నిషేధం వర్తిస్తుంది. అంతకుముందు నూకలపైనా ఇప్పుడు పార్‌బాయిల్డ్‌ రైస్‌ ఎగుమతులపైనా సుంకం అమలు చేయడంతో.. అన్నిరకాల బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించినట్లయింది. దేశీయ రిటైల్‌ మార్కెట్లో సంవత్సరం వ్యవధిలో బియ్యం రేట్లు 11.5 శాతం మేర పెరిగాయి. దింతో ఈ సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ మధ్య 15.54 లక్షల టన్నుల నాన్‌ బాస్మతీ రైస్‌ మన దేశం నుంచి ఎగుమతైంది. అంతకుముందు సంవత్సరం ఇదే సమయంలో ఈ ఎగుమతులు 11.55 లక్షల టన్నులుగా ఉన్నాయి. ఎక్స్పోర్ట్స్ విపరీతంగా పెరగడం, దాని కారణంగా నిల్వలు తగ్గి దేశీయంగా ధరలు పెరగడంతో.. ఈ బియ్యం రకాలపై కేంద్రం నిషేధం విధించింది.