LOADING...
Stock Market: మరోసారి నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు.. కనిష్ఠానికి రూపాయి
మరోసారి నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు.. కనిష్ఠానికి రూపాయి

Stock Market: మరోసారి నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు.. కనిష్ఠానికి రూపాయి

వ్రాసిన వారు Sirish Praharaju
May 12, 2026
10:17 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మరో రోజు నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై స్పష్టత లేకపోవడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీనికి తోడు ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడంతో దేశీయ సూచీలపై ఒత్తిడి పెరిగింది. ఉదయం 9.37 గంటల సమయానికి సెన్సెక్స్‌ 656 పాయింట్లు పడిపోయి 75,369 వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 171 పాయింట్లు తగ్గి 23,641 వద్ద ట్రేడవుతోంది.

వివరాలు 

ఆల్‌టైమ్ కనిష్ఠానికి రూపాయి

నిఫ్టీ సూచీలో ఓఎన్‌జీసీ, హిందాల్కో, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌, బజాజ్‌ ఆటో షేర్లు లాభాల్లో కనిపించాయి. అయితే ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక రూపాయి మారకం విలువ కూడా మరింత బలహీనపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ జీవనకాల కనిష్ఠానికి చేరి 95.63గా నమోదైంది.

Advertisement