Stock market: ఊగిసలాటలో స్టాక్ మార్కెట్.. స్వల్ప నష్టాల్లో సెన్సెక్స్, లాభాల్లో నిఫ్టీ
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ట్రేడింగ్‌ను ఊగిసలాట ధోరణిలో ప్రారంభించాయి. ఉదయం 9.18 గంటల సమయానికి సెన్సెక్స్ 14 పాయింట్ల నష్టంతో ట్రేడవుతుండగా, నిఫ్టీ 2 పాయింట్ల స్వల్ప లాభాల్లో కొనసాగుతోంది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇరాన్-అమెరికా మధ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయన్న వార్తలతో పాటు, కీలకమైన హర్మూజ్ జలసంధి మళ్లీ తెరుచుకోనుందనే సంకేతాలు మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతున్నాయి. అయితే, గత రెండు ట్రేడింగ్ సెషన్లుగా మార్కెట్లు వరుసగా లాభపడటంతో ప్రస్తుతం పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వివరాలు
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 94.71గా నమోదు
కరెన్సీ మార్కెట్లో కూడా రూపాయిపై ఒత్తిడి కనిపిస్తోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 21 పైసలు క్షీణించి ప్రస్తుతం రూ.94.71 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు కూడా అధిక స్థాయిలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం గ్రాము బంగారం ధర రూ.15,511.60గా నమోదైంది.