LOADING...
Indian rupee: చరిత్రలోనే కనిష్ఠానికి చేరిన భారత రూపాయి.. 89.92 వద్ద నిలిచిన రూపాయి
చరిత్రలోనే కనిష్ఠానికి చేరిన భారత రూపాయి.. 89.92 వద్ద నిలిచిన రూపాయి

Indian rupee: చరిత్రలోనే కనిష్ఠానికి చేరిన భారత రూపాయి.. 89.92 వద్ద నిలిచిన రూపాయి

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 02, 2025
11:53 am

ఈ వార్తాకథనం ఏంటి

డాలర్‌తో పోల్చితే భారత రూపాయి ఈ రోజు చరిత్రలోనే అత్యల్ప స్థాయికి పడిపోయి 89.92 వద్ద ట్రేడైంది. సోమవారం నమోదైన 89.78 రికార్డును దాటుతూ తాజా కనిష్టాన్ని తాకిన రూపాయి,నవంబర్ 3 తర్వాత ఇప్పటివరకు డాలర్‌పై రూపాయికి పైగా విలువ కోల్పోయిందని గణాంకాలు చెబుతున్నాయి. ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమావేశానికి కొద్ది రోజుల ముందే, రెండో త్రైమాసికంలో జీడీపీ 8.2 శాతం బలంగా పెరిగినప్పటికీ రూపాయిపై ఒత్తిడి తగ్గడం లేదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. కొటక్ సెక్యూరిటీస్ విశ్లేషకుడు అనింద్య బెనర్జీ మాట్లాడుతూ ఇప్పటివరకు ఆర్‌బీఐ నుంచి పెద్దగా జోక్యం కనిపించలేదని, ఇటీవల భారీ ఎన్డీఎఫ్ ఎక్స్‌పైరీల కారణంగా రోలింగ్ ఓవర్లు, కవరింగ్ జరిగాయని తెలిపారు.

వివరాలు 

ఆర్‌బీఐ కొంతమేర డాలర్ల విక్రయం 

డాలర్-రూపాయి మారకం 90 దాటితే స్టాప్‌లాసులు ట్రిగ్గర్ అయ్యి 91 దిశగా వేగంగా కదలొచ్చని ఆయన అంచనా వేశారు. డీఎస్‌పీ ఫైనాన్స్‌కు చెందిన జయేష్ మెహతా కూడా ఎఫ్‌పీఐల రోజువారీ అమ్మకాలు, ఆర్‌బీఐ మద్దతు లేకపోవడం, ఎన్డీఎఫ్ కవరింగ్ కారణంగానే రూపాయి బలహీనమైందని చెప్పారు. శుక్రవారం వడ్డీ రేట్లు తగ్గించి, మార్చి 2026 వరకు రూ.2 లక్షల కోట్ల ఓపెన్ మార్కెట్ ఆపరేషన్లు చేపట్టాలని ఆయన సూచించారు. మరోవైపు 90 దాటకుండా నిలువరించేందుకు ఆర్‌బీఐ కొంతమేర డాలర్లు విక్రయించిందని రాయిటర్స్ తెలిపింది.

Advertisement