LOADING...
Indian rupee: జీవనకాల కనిష్ఠానికి రూపాయి.. అమెరికా డాలర్‌తో రూ.91.99కు చేరిన విలువ
జీవనకాల కనిష్ఠానికి రూపాయి.. అమెరికా డాలర్‌తో రూ.91.99కు చేరిన విలువ

Indian rupee: జీవనకాల కనిష్ఠానికి రూపాయి.. అమెరికా డాలర్‌తో రూ.91.99కు చేరిన విలువ

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 29, 2026
11:11 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్‌లో భారత రూపాయి ఒత్తిడికి లోనవుతోంది. తాజా ట్రేడింగ్ సెషన్‌లో తొలిసారి 92 స్థాయిని తాకి, డాలరుతో పోలిస్తే ఇప్పటివరకు లేనంత తక్కువ విలువకు పడిపోయింది. గత సెషన్ ముగింపులో రూపాయి డాలరుతో పోలిస్తే 31 పైసలు క్షీణించి 91.99 వద్ద స్థిరపడిన విషయం తెలిసిందే.

వివరాలు 

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయాలు ప్రధాన కారణం

ఈ పరిణామాలకు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయాలు ప్రధాన కారణంగా మారాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ఫెడ్‌ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడంతో, ఇటీవల నాలుగేళ్ల కనిష్ఠాల వద్ద ఉన్న డాలర్ మళ్లీ బలపడింది. డాలర్ పుంజుకోవడంతో రూపాయిపై ఒత్తిడి మరింత పెరిగింది. దీనికితోడు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు కూడా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో అమెరికా యుద్ధ నౌకల మోహరింపుతో, ఇరాన్‌పై ఎప్పుడైనా దాడి జరిగే అవకాశముందన్న ఆందోళనలు మార్కెట్లలో భయాన్ని పెంచుతున్నాయి.

Advertisement