LOADING...
Stock Market: ఒడిదొడుకుల్లో స్టాక్ మార్కెట్.. స్వల్ప నష్టాల్లో సెన్సెక్స్ 

Stock Market: ఒడిదొడుకుల్లో స్టాక్ మార్కెట్.. స్వల్ప నష్టాల్లో సెన్సెక్స్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 29, 2026
09:59 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు దేశీయ స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. అయితే అమెరికా-ఇరాన్ మధ్య తాజాగా కుదిరిన తాత్కాలిక ఒప్పందంతో రూపాయి కొంత బలపడింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 94.31 వద్ద నిలిచింది. అంతర్జాతీయ రాజకీయ పరిణామాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండగా, బ్యాంకింగ్ రంగంలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. గత ట్రేడింగ్ సెషన్‌లో 77,100 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్ సోమవారం ఉదయం స్వల్ప నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించింది. అనంతరం కొద్దిసేపు లాభాల్లోకి వెళ్లినా, మళ్లీ అమ్మకాల ఒత్తిడి పెరగడంతో నష్టాల్లోకి జారుకుంది.

వివరాలు 

నిఫ్టీ @ 24,072

ఉదయం 9:40 గంటల సమయానికి సెన్సెక్స్ 30 పాయింట్లు క్షీణించి 77,070 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ కూడా రోజంతా ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ప్రస్తుతం 16 పాయింట్ల లాభంతో 24,072 వద్ద కొనసాగుతోంది. షేర్ల విషయానికి వస్తే.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, జీఎమ్‌ఆర్ ఎయిర్‌పోర్ట్స్, మ్యాక్స్ హెల్త్ కేర్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, మోతీలాల్ ఓస్వాల్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు పెర్సిస్టెంట్, ఆస్ట్రాల్ లిమిటెడ్, వెర్నోవా టీడీ, వారీ ఎనర్జీస్, సుప్రీమ్ ఇండస్ట్రీస్ షేర్లు నష్టాలను చవిచూస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 142 పాయింట్ల నష్టంతో కొనసాగుతుండగా, నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ కూడా 67 పాయింట్లు కోల్పోయి ట్రేడవుతోంది.

Advertisement