NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock market: భారీ లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు .. వెయ్యి పాయింట్ల లాభంలో సెన్సెక్స్‌
    తదుపరి వార్తా కథనం
    Stock market: భారీ లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు .. వెయ్యి పాయింట్ల లాభంలో సెన్సెక్స్‌
    భారీ లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

    Stock market: భారీ లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు .. వెయ్యి పాయింట్ల లాభంలో సెన్సెక్స్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 24, 2025
    01:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గణనీయమైన లాభాలతో కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్‌లోనూ పెరుగుదల కనబరుస్తున్నాయి.

    దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో విదేశీ మదుపర్ల కొనుగోళ్ల ప్రభావంతో మదుపర్లలో కొత్త ఉత్సాహం నెలకొంది.

    ఈ నేపథ్యంలో, సెన్సెక్స్ వెయ్యికి పైగా పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 23,600 మార్కు పైకి ఎగసింది.

    బీఎస్‌ఈలో మదుపర్ల సంపద దాదాపు రూ.5 లక్షల కోట్ల మేర పెరిగి మొత్తం రూ.418 లక్షల కోట్లకు చేరుకుంది.

    మధ్యాహ్నం 12.42 గంటల సమయంలో, సెన్సెక్స్ 982.01 పాయింట్ల లాభంతో 77,887.52 వద్ద కొనసాగుతోంది.

    వివరాలు 

    ఒక్క రోజులో ఈ స్థాయిలో పెట్టుబడులు.. ఇదే మొదటిసారి

    నిఫ్టీ 285.40 పాయింట్లు పెరిగి 23,635.80 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

    అయితే, టైటాన్, ఇండస్ ఇండ్ బ్యాంక్, జొమాటో, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

    గత శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు దాదాపు రూ.7,470 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

    గత నాలుగు నెలల్లో ఒక్క రోజులో ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం ఇదే మొదటిసారి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Operation Sindoor: ఉగ్రవాదం నిర్మూలనకే 'ఆపరేషన్‌ సిందూర్‌' : భారత సైన్యం భారత సైన్యం
    INDw vs SLw: మహిళల ముక్కోణపు వన్డే టైటిల్ భారత్‌దే స్మృతి మంధాన
    operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్  ఆపరేషన్‌ సిందూర్‌
    HYD Metro: ప్రపంచానికి బ్లూప్రింట్‌గా హైదరాబాద్ మెట్రో.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రశంసలు! హైదరాబాద్

    స్టాక్ మార్కెట్

    Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ @22,550  బిజినెస్
    Stock market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @22,545.05 బిజినెస్
    Stock Market: భారీ నష్టాలలో స్టాక్‌ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్‌ 700 పాయింట్లు డౌన్  బిజినెస్
    Stock market crash: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. మదుపర్లకు రూ.10 లక్షల కోట్ల నష్టం! వ్యాపారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025