Stock Market: లాభాలతో మొదలైన దేశీయ మార్కెట్ సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా నుంచి ఈ వారం వెలువడనున్న కీలక ఆర్థిక గణాంకాల మీద మదుపర్ల దృష్టి సారించారు. ఆ సంఖ్యలు వచ్చిన తర్వాతే డిసెంబర్‌లో వడ్డీ రేట్లపై ఫెడరల్ రిజర్వ్ ఏ వైపు మొగ్గుచూపుతుందో స్పష్టత రానుంది. ప్రపంచ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల సంకేతాలు కూడా దేశీయ సూచీలకు బలంగా మారడంతో, ఈ వారాన్ని భారత స్టాక్ మార్కెట్ లాభాల మూడ్‌లోనే ఆరంభించింది. ఎక్కువశాతం రంగాలు గ్రీన్‌లోనే ట్రేడ్ అవుతున్నాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ రెండూ ప్రస్తుతం లాభాల దిశలో కదులుతున్నాయి. మునుపటి సెషన్ ముగింపు స్థాయి (84,562)తో పోలిస్తే, సోమవారం ట్రేడింగ్ మొదలయ్యే సరికి సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్ల వరకు ఎగబాకింది.
వివరాలు
రూపాయి—డాలర్ మారకం విలువ 88.72గా నమోదు
ఆ సానుకూల రితీ కొనసాగుతూనే ఉండగా, ఉదయం 9:45 గంటల సమయానికి సెన్సెక్స్ 254 పాయింట్లు ప్లస్‌లో 84,817 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే దారిలో నిఫ్టీ కూడా ప్రయాణిస్తోంది. ప్రస్తుతం నిఫ్టీ 58 పాయింట్ల లాభంతో 25,967 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌లో హీరో మోటోకార్ప్,మారికో,కెనరా బ్యాంక్,వోల్టాస్,బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి స్టాక్స్ మంచి లాభాలను నమోదు చేస్తున్నాయి. మరోవైపు గ్లెన్‌మార్క్, ఆస్ట్రాల్ లిమిటెడ్,పీజీ ఎలక్ట్రోప్లాస్ట్,సుప్రీమ్ ఇండస్ట్రీస్, ఫీనిక్స్ మిల్స్ వంటి షేర్లు మాత్రం నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 345 పాయింట్ల లాభంలో ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్‌గా 367 పాయింట్లు ఎగసి ట్రేడ్ అవుతోంది. అదే సమయంలో రూపాయి—డాలర్ మారకం విలువ 88.72గా నమోదైంది.