Stock market: నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్.. భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు గరిష్ఠ స్థాయుల వద్ద కొనసాగుతున్నప్పటికీ.. ఫార్మా, హెల్త్‌కేర్, మెటల్ రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు పుంజుకున్నాయి. దీంతో వరుసగా నాలుగు రోజుల పాటు కొనసాగిన నష్టాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ ఉదయం 72,990.04 పాయింట్ల వద్ద నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. గత సెషన్‌లో ఇది 73,123.83 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే, కొద్దిసేపటికే సూచీ లాభాల్లోకి వచ్చింది. చివరకు 482.92 పాయింట్లు పెరిగి 73,606.75 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ కూడా 153.20 పాయింట్లు లాభపడి 22,753.20 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.19గా నమోదైంది.
వివరాలు
బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 115 డాలర్లు
సెన్సెక్స్-30 సూచీలో అదానీ పోర్ట్స్, ఎటర్నల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ట్రెంట్, టాటా స్టీల్ షేర్లు ప్రధానంగా లాభాలను నమోదు చేశాయి.
మరోవైపు బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారుతీ సుజుకీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టాలను చవిచూశాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మాత్రం అధిక స్థాయుల్లోనే కొనసాగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 115 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
మరోవైపు బంగారం ధర ఔన్సుకు 4,018 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
చమురు ధరలు పెరిగినప్పటికీ, కొన్ని కీలక రంగాల షేర్లలో కొనుగోళ్లు జరగడం దేశీయ మార్కెట్ సూచీలకు మద్దతుగా నిలిచింది.