Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. టీసీఎస్ షేర్లు 9% పతనం
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై కొనసాగుతున్న అనిశ్చితి, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్‌ఐఐలు)వరుసగా షేర్ల విక్రయాలు కొనసాగించడం మదుపర్లలో ఆందోళన పెంచాయి. ముఖ్యంగా ఐటీ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి అధికంగా కనిపించడంతో ప్రధాన సూచీలు దిగజారాయి. ఇందులో టీసీఎస్ షేరు దాదాపు 9శాతం వరకు క్షీణించడం మార్కెట్‌పై మరింత ప్రభావం చూపింది. ఉదయం 74,507.73 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ట్రేడింగ్ సమయంలో 73,492.60 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. అనంతరం కొంత కోలుకున్నప్పటికీ, చివరికి 303.67 పాయింట్లు కోల్పోయి 74,346.17 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 77.95 పాయింట్లు తగ్గి 23,405.60 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 95.71గా నమోదైంది.
వివరాలు
బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్‌కు 98 డాలర్లు
సెన్సెక్స్‌లోని 30 షేర్లలో టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, ఐటీసీ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. మరోవైపు ఇండిగో, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ట్రెంట్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు లాభాల్లో నిలిచాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్‌కు 98 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్సు ధర 4,461 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
వివరాలు
టీసీఎస్‌కు భారీ ఎదురుదెబ్బ
ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) షేర్లు నేటి ట్రేడింగ్‌లో భారీగా క్షీణించాయి. కొవిడ్ మహమ్మారి అనంతరం కంపెనీ షేర్లు ఎదుర్కొన్న అతిపెద్ద పతనంగా ఇది నమోదైంది. ఐటీ రంగంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, గ్లోబల్ అనిశ్చితి ప్రభావంతో టీసీఎస్ షేర్లపై తీవ్ర అమ్మకాల ఒత్తిడి కనిపించింది.