UPI: కంబోడియాలో త్వరలో అందుబాటులోకి రానున్న యూపీఐ సేవలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) గ్లోబల్ విభాగం NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (NIPL) కంబోడియాలోని తొలి పబ్లిక్ లిస్టెడ్ కమర్షియల్ బ్యాంక్ అయిన ACLEDA బ్యాంక్‌తో భాగస్వామ్యం చేసుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా భారతదేశం మరియు కంబోడియా మధ్య క్రాస్-బోర్డర్ QR కోడ్ చెల్లింపులు సులభం అవుతాయి. దీనివల్ల పర్యాటకులకు అనుకూలత కలిగేలా చేస్తూ, వ్యాపారాలకు కొత్త డిజిటల్ పేమెంట్ అవకాశాలు ఏర్పడతాయి.
వివరాలు
భారత పర్యాటకులు కంబోడియాలో సులభంగా చెల్లింపులు
ఈ భాగస్వామ్యంతో, కంబోడియా నేషనల్ QR నెట్‌వర్క్ 'Bakong (KHQR)'ని నిర్వహించే ACLEDA బ్యాంక్, NIPLతో కలిసి పనిచేస్తుంది. దీని ఫలితంగా భారత పర్యాటకులు కంబోడియాలో 45 లక్షల KHQR మర్చంట్ పాయింట్లలో UPI-సమర్థిత యాప్‌ల ద్వారా చెల్లింపులు చేయగలుగుతారు. అదే విధంగా, కంబోడియా పర్యాటకులు భారతదేశంలో 7.09 కోట్ల UPI QR కోడ్‌లను తమ స్థానిక పేమెంట్ యాప్‌లతో స్కాన్ చేసి చెల్లింపులు చేసుకోవచ్చు.
వివరాలు
డిజిటల్ చెల్లింపు అవకాశాలను విస్తరించడమే లక్ష్యం
NIPL,ACLEDA బ్యాంక్ భాగస్వామ్యం ద్వారా వ్యాపారాలు, వినియోగదారులకూ డిజిటల్ చెల్లింపు అవకాశాలు పెరుగుతాయని విశ్వసించవచ్చు. NPCI ఇంటర్నేషనల్ MD & CEO రితేష్ శుక్లా మాట్లాడుతూ, "ఈ భాగస్వామ్యం డిజిటల్ పేమెంట్ కారిడార్లను బలపరుస్తుంది. పర్యాటకులు తమకు తెలిసిన, విశ్వసనీయ చెల్లింపు అవకాశాలను సులభంగా ఉపయోగించగలుగుతారు" అని తెలిపారు. ACLEDA బ్యాంక్ ప్రెసిడెంట్ & గ్రూప్ MD ఇన్ చాన్నీ కూడా, "ఈ ఒప్పందం వేగవంతమైన, తక్కువ ఖర్చుతో క్రాస్-బోర్డర్ చెల్లింపులను సులభతరం చేస్తూ, ఆర్థిక నూతనతను ప్రోత్సహిస్తుంది" అని పేర్కొన్నారు.
వివరాలు
భారత చెల్లింపు వ్యవస్థలను ప్రపంచానికి తీసుకెళ్ళడంలో NIPL పాత్ర
2020లో స్థాపించబడిన NIPL, భారత రియల్ టైం పేమెంట్ సిస్టమ్ UPI,కార్డు స్కీమ్ RuPayని ఇతర దేశాల్లో అందిస్తుంది. దేశాలకు తమ స్వంత డోమెస్టిక్ పేమెంట్ సిస్టమ్ ఏర్పాటు చేయడానికి NIPL టెక్నాలజీ సపోర్ట్, లైసెన్సింగ్, సలహా సేవలు అందిస్తుంది. ACLEDA బ్యాంక్ $11.94 బిలియన్ల ఆస్తులు కలిగి, కంబోడియా, మయన్మార్, లావోస్‌లో 61.8 లక్షల కస్టమర్లకు సేవలు అందిస్తుంది. ACLEDA సూపర్ యాప్ ద్వారా 53.5 లక్షల మొబైల్ యూజర్లకు సేవలు అందిస్తోంది.