Page Loader
IndiGo: మహిళల కోసం ఇండిగో ప్రత్యేక ఫీచర్‌.. 1,199తో స్పెషల్ సేల్ 
IndiGo: మహిళల కోసం ఇండిగో ప్రత్యేక ఫీచర్‌.. 1,199తో స్పెషల్ సేల్

IndiGo: మహిళల కోసం ఇండిగో ప్రత్యేక ఫీచర్‌.. 1,199తో స్పెషల్ సేల్ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 29, 2024
03:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల కోసం ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఒక కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది. దీని ద్వారా మహిళా ప్రయాణికులు వెబ్ చెక్-ఇన్ సమయంలో ఇతర మహిళా ప్రయాణికులు బుక్‌ చేసుకున్న సీట్లు ఏంటో చూడొచ్చు. వాటిని బట్టి తమ సీట్లను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. విమానయాన సంస్థ ప్రయాణ సౌకర్యం, భద్రత కోసం ఈ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఈ ఫీచర్‌ను ప్రారంభించే ముందు, తమ మహిళా ప్రయాణికుల అవసరాలను బాగా అర్థం చేసుకోవడానికి ఎయిర్‌లైన్ మార్కెట్ పరిశోధనను నిర్వహించింది. మహిళలకు సౌకర్యవంతమైన, భద్రమైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే మా లక్ష్యం'' అని ఇండిగో తమ ప్రకటనలో వెల్లడించింది.

ఫీచర్ 

ఈ ఫీచర్ వెబ్ చెక్-ఇన్ సమయంలో మాత్రమే పని చేస్తుంది 

ఈఫీచర్ ద్వారా మహిళా ప్రయాణీకులు తమ సౌకర్యాన్ని బట్టి మరో మహిళా ప్రయాణీకురాలి పక్కన సీటును ఎంచుకోవచ్చు. అయితే, ఈ ఫీచర్ ఒంటరిగా ప్రయాణించే మహిళలతో పాటు ఫ్యామిలీ బుకింగ్స్‌కు కూడా ఇది వర్తిస్తుంది .ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ మోడ్‌లో ఉంది. రూ.1199తో స్పెషల్‌ సేల్‌.. కొత్త సీటింగ్ ఫీచర్లతో పాటు,ఇండిగో దేశీయ,అంతర్జాతీయ విమానాల కోసం ప్రత్యేక విక్రయాలను కూడా ప్రారంభించింది. ఈరోజు నుండి మే 31వరకు కొనసాగే ఈ సేల్‌లో ఛార్జీలు ₹ 1,199నుండి ప్రారంభమవుతాయి. ఈఏడాది జూలై 1 నుంచి సెప్టెంబర్ 30మధ్య ప్రయాణాలకు తగ్గింపు ధరలు వర్తిస్తాయి. అంతేగాక,కస్టమర్లు కోరుకున్న సీట్లకు విధించే ఛార్జీలపై 20శాతం వరకు డిస్కౌంట్‌ కూడా పొందొచ్చని విమానయాన సంస్థ వెల్లడించింది.