
PhonePe Insurance: టపాసుల ప్రమాదాల నుంచి బీమా.. రూ.9 లకే ఫోన్‌పే కొత్త ఆఫర్
ఈ వార్తాకథనం ఏంటి
దీపావళి పండుగ సందర్భంగా టపాసులు కాల్చే సమయంలో గాయపడే వారికి బీమా అందించేందుకు ఫోన్‌పే (PhonePe) కొత్త ప్రత్యేక బీమా పాలసీని ప్రకటించింది.
ఈ బీమా పథకం ప్రకారం, బాణసంచా వల్ల ప్రమాదవశాత్తు గాయపడిన వారు రూ.9 చెల్లించి రూ.25,000 వరకు బీమా కవరేజీ పొందే అవకాశం ఉంటుంది.
ఈ ప్రత్యేక కవరేజీ అక్టోబర్ 25 నుంచి 10 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది.
ఫోన్‌పే యూజర్, ఆయన భార్య, పిల్లలు సహా మొత్తం నలుగురు వ్యక్తులకు సమగ్ర కవరేజీ తీసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది.
Details
'ఫైర్ క్రాకర్ ఇన్సూరెన్స్' అప్షన్ ను ఎంచుకోవాలి
అక్టోబర్ 25 తర్వాత ఈ పాలసీని కొనుగోలు చేసిన వారు ఆ రోజుతో కూడిన కవరేజీ పొందుతారు.
దీపావళి పండుగను గుర్తుచేస్తూ, బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో కలిసి ఈ బీమా సేవలను ప్రవేశపెట్టినట్లు ఫోన్‌పే తెలిపింది.
ఈ బీమా పాలసీని కొనుగోలు చేసేందుకు ఫోన్‌పేలోని ఇన్సూరెన్స్ విభాగానికి వెళ్లి 'ఫైర్ క్రాకర్ ఇన్సూరెన్స్' ఎంపిక చేసుకుని సంబంధిత వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.