
Intel Lays OFF: 18వేల మంది ఉద్యోగులపై వేటు వేసిన ఇంటెల్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్ చిప్‌ల తయారీ సంస్థ ఇంటెల్ కీలక నిర్ణయం తీసుకుంది.
తమ సంస్థలో పనిచేస్తున్న దాదాపు 18వేల మందిని తొలగించాలని నిర్ణయించుకుంది.
కంపెనీ కార్యకలాపాల క్రమబద్ధీకరణలో భాగంగా 15 శాతానికి పైగా ఉద్యోగులను తగ్గిస్తున్నట్లు గురువారం వెల్లడించింది.
ఇటీవల ముగిసిన త్రైమాసికంలో కంపెనీ సూమారుగా 1.6 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది.
ఈ కారణంగా ఈ ఏడాది వ్యయాలను 20 బిలియన్ డాలర్ల మేర కుదించుకునేలా ప్రణాళికలు చేశామని స్పష్టం చేసింది.
Details
20 బిలియన్ల డాలర్ల వరకు ఖర్చు తగ్గింపు
ఇక రెండోవ త్రైమాసికంలో కంపెనీ ఆర్థిక పనితీరు నిరాశాజనకంగా ఉందని ఆ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాట్ గెల్సింగర్ అన్నారు.
గతేడాది చివరి నాటికి ఇంటెల్‌లో 1,24,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో 15శాతం మందిని తొలగిస్తే దాదాపుగా 18000 మందిపై ఈ ప్రభావం పడనుంది.
ఇప్పుడు ఈ ఉద్యోగులను తొలగిస్తే ప్రతేడాది ఇంటెల్‌కు 20 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు తగ్గుతాయని అంచనా వేశారు.
ఏఐ విప్లవం సరికొత్త సాంకేతికతలను ఆవిష్కరించడంలో ఆ కంపెనీకి ఇబ్బందులొచ్చాయి.