LOADING...
Upcoming IPOs: ఐపీఓ షెడ్యూల్ విడుదల.. ఈసారి లిస్టింగ్‌లే ఇన్వెస్టర్ల ఫోకస్!
ఐపీఓ షెడ్యూల్ విడుదల.. ఈసారి లిస్టింగ్‌లే ఇన్వెస్టర్ల ఫోకస్!

Upcoming IPOs: ఐపీఓ షెడ్యూల్ విడుదల.. ఈసారి లిస్టింగ్‌లే ఇన్వెస్టర్ల ఫోకస్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 13, 2025
02:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రైమరీ మార్కెట్‌లో ఐపీఓల (IPO) హవా కొనసాగుతోంది. ఒకవైపు కొత్త ఐపీఓల సబ్‌స్క్రిప్షన్లు, మరోవైపు పలు కంపెనీల లిస్టింగ్‌లతో వచ్చే వారం (డిసెంబర్‌ 15 నుంచి 19 వరకు) మార్కెట్‌లో సందడి వాతావరణం నెలకొననుంది. మెయిన్‌బోర్డు విభాగంలో కేవలం ఒక్క సంస్థ మాత్రమే పబ్లిక్ ఇష్యూకు సిద్ధమవుతుండగా కొరోనా రెమిడీస్‌, వేక్‌ఫిట్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ వంటి ప్రముఖ సంస్థలు లిస్టింగ్‌కు రానున్నాయి. దీంతో కొత్త ఇష్యూల కంటే లిస్టింగ్‌లపైనే ఇన్వెస్టర్ల ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది.

Details

వచ్చే వారం ఐపీఓలు ఇవే

మెయిన్‌బోర్డు కేటగిరీలో కేఎస్‌హెచ్‌ ఇంటర్నేషనల్‌ ఒక్కటే సబ్‌స్క్రిప్షన్‌కు రానుంది. తాజా షేర్లు, ఆఫర్ ఫర్ సేల్ కలిపి దాదాపు రూ.700 కోట్లు సమీకరించనుంది. ఈ ఐపీఓ డిసెంబర్‌ 16న ప్రారంభమై 18న ముగుస్తుంది. షేర్ ధరల శ్రేణిని రూ.365 నుంచి రూ.384గా నిర్ణయించారు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్టింగ్‌ కానుంది. ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో మొత్తం మూడు కంపెనీలు ఐపీఓకు రానున్నాయి. నెప్ట్యూట్‌ లాజిటెక్‌ డిసెంబర్‌ 15న సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభించనుండగా, మార్క్‌ టెక్నోక్రాట్స్‌, గ్లోబల్‌ ఓషన్‌ లాజిస్టిక్స్‌ డిసెంబర్‌ 17న ఇష్యూ తెరవనున్నాయి.

Details

లిస్టింగ్‌ల షెడ్యూల్

మెయిన్‌బోర్డు విభాగంలో ఫార్మా సంస్థ కొరోనా రెమిడీస్‌, ఫర్నీచర్‌ కంపెనీ వేక్‌ఫిట్‌ ఇన్నోవేషన్‌ డిసెంబర్‌ 15న స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ కానున్నాయి. కొరోనా రెమిడీస్‌ ఐపీఓకు 144 రెట్లు, వేక్‌ఫిట్‌ ఐపీఓకు 2.52 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ లభించింది. అదే రోజు రిద్ది డిస్‌ప్లే, ప్రోడాక్స్‌ సొల్యూషన్స్‌, కేవీ టాయ్స్‌ షేర్లు ఎస్‌ఎంఈ కేటగిరీ నుంచి మార్కెట్‌లోకి రానున్నాయి. మెయిన్‌బోర్డు కేటగిరీలో నెఫ్రోకేర్‌ హెల్త్‌, పార్క్‌ మెడి వరల్డ్‌ డిసెంబర్‌ 17న లిస్టింగ్‌కు సిద్ధమవుతున్నాయి. అదే రోజు ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో యునిసెమ్‌ అగ్రిటెక్‌, షిప్‌వేవ్స్‌ ఆన్‌లైన్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టనున్నాయి. పాజ్సన్‌ ఆగ్రో ఇండియా, హెచ్‌ఆర్‌ఎస్‌ అలుగ్లేజ్‌** కంపెనీలు డిసెంబర్‌ 18న ఎస్‌ఎంఈ కేటగిరీలో లిస్ట్‌ కానున్నాయి.

Advertisement

Details

19న స్టాక్ మార్కెట్లోకి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ

దాదాపు రూ.10,000 కోట్లు సమీకరించేందుకు ఐపీఓకు వచ్చిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ డిసెంబర్‌ 19న స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్‌కు రానుంది. ఈ ఐపీఓ డిసెంబర్‌ 12న ప్రారంభమై 16న ముగియనుంది. ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.2,061 నుంచి రూ.2,165గా నిర్ణయించారు. అదే రోజు స్టాన్‌బిక్‌ ఆగ్రో, అశ్విని కంటెయినర్‌, ఎగ్జిమ్‌ రూట్స్‌ సంస్థలు ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో లిస్టింగ్‌కు సిద్ధమవుతున్నాయి.

Advertisement