LOADING...
IRCTC: ఆన్‌లైన్ చెల్లింపుల రంగంలోకి ఐఆర్‌సీటీసీ.. ప్రాథమికంగా అనుమతి ఇచ్చిన ఆర్ బి ఐ 
ఆన్‌లైన్ చెల్లింపుల రంగంలోకి ఐఆర్‌సీటీసీ

IRCTC: ఆన్‌లైన్ చెల్లింపుల రంగంలోకి ఐఆర్‌సీటీసీ.. ప్రాథమికంగా అనుమతి ఇచ్చిన ఆర్ బి ఐ 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 06, 2025
01:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

రైల్వే టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసే ప్రముఖ సంస్థ అయిన ఐఆర్‌సీటీసీ కి చెందిన సబ్సిడియరీ అయిన IRCTC పేమెంట్స్ లిమిటెడ్‌కు,ఆన్‌లైన్ పేమెంట్ అగ్రిగేటర్‌గా పనిచేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రాథమికంగా అనుమతి ఇచ్చింది. ఆగస్టు 6న ఈ సమాచారం స్టాక్ ఎక్స్ఛేంజ్‌కి ఇచ్చిన సమాచారం ద్వారా వెలువడింది. దీంతో కంపెనీ షేర్లు 1 శాతం పైన పెరిగాయి.ఆగస్టు 4,2025న తేదీతో వచ్చిన RBI లేఖ ప్రకారం పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007 ప్రకారం IRCTC పేమెంట్స్ లిమిటెడ్‌కు ఆన్‌లైన్ పేమెంట్ అగ్రిగేటర్‌గా పనిచేసేందుకు "ఇన్-ప్రిన్సిపల్" అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ సంస్థను ప్రత్యేకంగా పేమెంట్ అగ్రిగేటర్ బిజినెస్ కోసం ఫిబ్రవరి 2024లో ఏర్పాటు చేశారు.

వివరాలు 

ఫైనల్ అప్రూవల్ కోసం IRCTC ఇంకా కొంతకాలం వేచి ఉండాలి 

ఇప్పుడు ప్రాథమిక అనుమతి వచ్చిన తర్వాత, ఫైనల్ అప్రూవల్ కోసం IRCTC ఇంకా కొంతకాలం వేచి ఉండాల్సి ఉంటుంది. కంపెనీ మునుపే చెప్పినట్టుగా, దీనికి సుమారు ఒక సంవత్సరం పడే అవకాశం ఉంది. డిసెంబర్ 2024లో RBIకి దరఖాస్తు పంపిన IRCTC, తర్వాత RBI అడిగిన కొన్ని క్లారిఫికేషన్లు ఇచ్చింది. బ్రోకరేజ్ సంస్థ Investec తాజా నివేదికలో, IRCTC షేరు ధర రూ.1200 వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో 'బై' రికమండేషన్ ఇచ్చింది. ఈ సబ్సిడియరీ ద్వారా IRCTC తన ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సేవలను మరింతగా మెరుగుపరచాలని, అలాగే పేమెంట్ గేట్‌వే, అగ్రిగేటర్ రంగాల్లో విస్తరించాలని చూస్తోంది.

వివరాలు 

 i-Pay ద్వారా రూ.114.54 కోట్లు ఆదాయం 

IRCTC i-Pay పేరిట పనిచేస్తున్న ఈ పేమెంట్ అగ్రిగేటర్ సేవలు అన్ని రకాల చెల్లింపు మార్గాలు అందిస్తోంది. ఇందులో ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డ్‌లు, వాలెట్లు, UPI, ఆటోపే వంటి విధానాలు ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం (FY24)లో ఈ i-Pay ద్వారా రూ.114.54 కోట్లు ఆదాయం వచ్చింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 19.33 శాతం వృద్ధి. అంతేకాకుండా, ఈ సబ్సిడియరీ క్యాష్, గిఫ్ట్ కార్డ్‌లు, కూపన్లు, లాయల్టీ కార్డులు జారీ చేయడమే కాకుండా, భారత్ బిల్ పేమెంట్ యూనిట్‌గా కూడా పని చేస్తోంది. పైగా, ఈ సంస్థ పేమెంట్ ప్రాసెసింగ్ సాఫ్ట్‌వేర్‌లు, ఫిన్‌టెక్ సొల్యూషన్‌లు అభివృద్ధి చేస్తూ, మాతృసంస్థ అయిన IRCTC ఈ-కామర్స్ కార్యకలాపాలకు మద్దతు ఇస్తోంది.

వివరాలు 

రూ.1269 కోట్లు ఆదాయం

FY25 నాలుగో త్రైమాసికం (Q4)లో IRCTC ఇంటర్నెట్ టికెటింగ్ ఆదాయం రూ.372.5 కోట్లుగా నమోదైంది. ఇది గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 8.78 శాతం వృద్ధి. మొత్తం గా రూ.1269 కోట్లు ఆదాయం సాధించి, కొత్త రికార్డు స్థాయికి చేరింది.