Page Loader
ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధం.. అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరలు 
ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధం.. అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరలు

ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధం.. అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరలు 

వ్రాసిన వారు Stalin
Oct 09, 2023
12:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాలస్తీనా హమాస్ మిలిటెంట్లు- ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో రాజకీయ అనిశ్చితిని నెలకొంది. దీని ప్రభావం ప్రపంచంపై తీవ్రంగా చూపుతోంది. ముఖ్యంగా అంతర్జాతీయంగా చమురు ధరలు మూడు రోజుల్లోనే 4% పెరిగాయి. గ్లోబల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ సోమవారం 4.53శాతం పెరిగి బ్యారెల్‌కు 88.41 డాలర్ల వద్ద వద్ద ట్రేడవుతోంది. అలాగే అమెరికాకు చెందిన వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 4.69శాతం పెరిగి 88.67 డాలర్లకు చేరుకుంది. అయితే చమురు ధరలు పెరిగినప్పటికీ, అంత భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 28న బ్యారెల్‌ గరిష్టంగా 97.69 డాలర్లకు చేరుకుంది. దీనితో పోలిస్తే, బ్యారెల్ ధర అదుపులోనే ఉన్నట్లు నిపుణులు అంటున్నారు.

హమాస్

ప్రపంచ చమురు సరఫరాలో పశ్చిమాసియా వాటా 3వ వంతు 

పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి చమురు ధరల్లో అధిక అస్థిరతను ఆశించవచ్చని ఎన్ఎన్‌జీ విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి ఇజ్రాయెల్, పాలస్తీనా చమురు ఉత్పత్తిదారులు కాదు. కానీ పశ్చిమాసియా ప్రాంతం ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు మూడోవంతు వాటాను కలిగి ఉంది. ఇజ్రాయెల్-హమాస్ పరస్పర దాడుల వల్ల సరఫరా తగ్గిపోయిది. అంతేకాదు, హమాస్‌కు మద్దతుగా ఉన్న ఇరాన్ చమురు ఎగుమతులపై తీవ్రమైన ప్రభావం పడింది. గ్లోబల్ చమురు సరఫరాలో ఐదవ వంతు హార్ముజ్ జలసంధి గుండా వెళుతుంది. ఈ జలసంధి గుండా వెళ్లే చమురులో అధిక వాటా ఇరాన్‌దే. ఇజ్రాయెల్-హమాస్ వార్ నేపథ్యంలో హార్ముజ్ జలసంధి వాణిజ్యంపై తీవ్రమైన ప్రభావం పడింది. దీంతో చమురు రవాణా భారీగా తగ్గినట్లు తెలుస్తోంది.