LOADING...
Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు.. 25,500 దిగువకు నిఫ్టీ
భారీ నష్టాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు.. 25,500 దిగువకు నిఫ్టీ

Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు.. 25,500 దిగువకు నిఫ్టీ

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 13, 2026
04:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్లు తీవ్ర నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, ముఖ్యంగా ఐటీ,మెటల్‌ షేర్లలో చోటుచేసుకున్న అమ్మకాల ఒత్తిడి సూచీలను కిందకు లాగింది. ఫలితంగా సెన్సెక్స్‌ వెయ్యికి పైగా పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 25,500 మార్క్‌ కంటే దిగువన ముగిసింది. ఈ పతనంతో మదుపర్ల సంపద సుమారు రూ.7 లక్షల కోట్ల మేర తగ్గిపోయింది. బీఎస్‌ఈలో లిస్ట్‌ అయిన కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.472.50 లక్షల కోట్ల నుంచి రూ.465.50 లక్షల కోట్లకు పడిపోయింది. సెన్సెక్స్‌ ఉదయం 82,902.73 పాయింట్ల వద్ద నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది (మునుపటి ముగింపు: 83,674.92).

వివరాలు 

బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర సుమారు 67 డాలర్లు 

రోజంతా నెగటివ్‌ ధోరణిలోనే కదిలిన సూచీ, ఇంట్రాడేలో 82,534.55 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 1,048.16 పాయింట్ల నష్టంతో 82,626.76 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ 336.10 పాయింట్లు పడిపోయి 25,471.10 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 90.66 వద్ద కొనసాగింది. సెన్సెక్స్‌ 30 షేర్లలో బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ తప్ప మిగిలిన అన్ని స్టాక్స్‌ నష్టాల బాట పట్టాయి. హిందుస్థాన్‌ యూనిలీవర్‌, ఎటెర్నెల్‌, టాటా స్టీల్‌, టైటాన్‌, టీసీఎస్‌ షేర్లు ప్రధానంగా నష్టాలను ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర సుమారు 67 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 4,977 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Advertisement