Loading...
Amazon shares: అమెజాన్ షేర్లలో 4 బిలియన్ డాలర్ల విలువైన వాటాను విక్రయించనున్న జెఫ్ బెజోస్
అమెజాన్ షేర్లలో 4 బిలియన్ డాలర్ల విలువైన వాటాను విక్రయించనున్న జెఫ్ బెజోస్

Amazon shares: అమెజాన్ షేర్లలో 4 బిలియన్ డాలర్ల విలువైన వాటాను విక్రయించనున్న జెఫ్ బెజోస్

వ్రాసిన వారు Moogati Shabari
Aug 05, 2026
11:52 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కంపెనీలో తనకున్న వాటాలో భాగంగా సుమారు 1.5 కోట్ల (15 మిలియన్) షేర్లను విక్రయించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన అధికారికంగా దాఖలు చేశారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరల ప్రకారం ఈ షేర్ల విలువ దాదాపు 4.1 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. ఇటీవల అమెజాన్ రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించి రావడం, క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం బలమైన వృద్ధిని నమోదు చేయడంతో సోమవారం కంపెనీ షేరు ధర చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకుంది. ఈ పరిణామాల అనంతరం బెజోస్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

వివరాలు

ఈ ఏడాది అమెజాన్ షేర్లకు దాదాపు 20 శాతం లాభం..

2026లో ఇప్పటివరకు అమెజాన్ షేరు ధర దాదాపు 20 శాతం పెరిగింది.

అదే సమయంలో ఎస్ అండ్ పీ 500 (S&P 500) సూచీ సుమారు 12 శాతం మాత్రమే పెరగడం గమనార్హం.

ఆగస్టు 3న కంపెనీ మార్కెట్ విలువ తాత్కాలికంగా 3 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని దాటింది.

అదే రోజు షేరు ధర రికార్డు స్థాయిలో ముగియడంతో 4.5 శాతం కంటే ఎక్కువ పెరుగుదల నమోదైంది.

అయితే, గత ఏడాది నవంబర్‌లో రూపొందించిన రూల్ 10b5-1 ట్రేడింగ్ ప్లాన్ ప్రకారం షేర్ల విక్రయానికి బెజోస్ దాఖలు చేసిన వివరాలు వెలుగులోకి రావడంతో, ఆ తర్వాతి ట్రేడింగ్‌లో అమెజాన్ షేరు ధర సుమారు 1 శాతం మేర తగ్గింది.

వివరాలు

బెజోస్ వద్ద మిగిలే షేర్లు 86.9 కోట్లకు..

అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (SEC)కు సమర్పించిన పత్రాల ప్రకారం, బెజోస్ 1.5 కోట్ల కామన్ షేర్లను విక్రయించనున్నారు. సోమవారం ముగింపు ధర ప్రకారం వాటి మొత్తం మార్కెట్ విలువ సుమారు 4.07 బిలియన్ డాలర్లు. ఈ షేర్లను బెజోస్ 1994 జూలైలో సంస్థ వ్యవస్థాపకుడిగా పొందిన ఫౌండర్ షేర్ల రూపంలో కలిగి ఉన్నారు. ఈ విక్రయం పూర్తయితే, ఆయన వద్ద ఉన్న మొత్తం షేర్లు 88.4 కోట్ల నుంచి 86.9 కోట్లకు తగ్గుతాయి. ఇది అమెజాన్ మొత్తం పెండింగ్ షేర్లలో సుమారు 8.1 శాతం వాటాకు సమానం. అయితే ఈ విక్రయం అనంతరం కూడా బెజోస్ వద్ద మిగిలే షేర్ల విలువ ప్రస్తుత ధరల ప్రకారం దాదాపు 244 బిలియన్ డాలర్లుగా ఉంటుంది.

ADVERTISEMENT