Loading...
Jensen Huang: ఎన్విడియాలో కీలక పరిణామం.. సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా
ఎన్విడియాలో కీలక పరిణామం.. సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా

Jensen Huang: ఎన్విడియాలో కీలక పరిణామం.. సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2026
07:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ అగ్రగామి చిప్ తయారీ సంస్థ నివిడియాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) జెన్సన్ హువాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. వరుస వివాదాలు, వివాహేతర సంబంధాలకు సంబంధించిన ఆరోపణలు నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సీఈవో పదవితో పాటు కంపెనీ బోర్డు సభ్యత్వానికి కూడా హువాంగ్ రాజీనామా చేశారు. ఆయన నిర్ణయాన్ని ఎన్విడియా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు వెంటనే ఆమోదించారు. హువాంగ్ స్థానంలో కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) కొలెట్ క్రెస్‌ను తాత్కాలిక సీఈవోగా నియమించినట్లు బోర్డు ప్రకటించింది. పూర్తిస్థాయి సీఈవో ఎంపిక కోసం ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు వెల్లడించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా

ADVERTISEMENT