Jp Morgan Chase & Co : ఖాతాదారుల కోసం బ్లాక్‌చెయిన్ ద్వారా ఫస్ట్ కొలేటరల్ నెట్‌వర్క్ ఉపయోగించిన జేపీ
గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దిగ్గజం 'జేపీ మోర్గాన్ చేజ్' (JP Morgan Chase) మరో కీలక మైలురాయిని సాధించింది. ప్రముఖ గ్లోబల్ బ్యాంక్, మొదటి వాణిజ్య అనువర్తనాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ మేరకు కొత్తగా ప్రారంభించిన టోకనైజ్డ్ కొలేటరల్ నెట్‌వర్క్ (TCN)ని ఉపయోగించి ప్రధాన మైలురాయిని చేరుకుంది. మరోవైపు బ్లూమ్‌బెర్గ్ తన బ్లాక్‌చెయిన్ నెట్‌వర్క్‌లో అక్టోబర్ 11న బ్లాక్‌రాక్, బార్క్లేస్ మధ్య పరిష్కారాన్ని విజయవంతంగా అమలు చేసింది. ఈ మేరకు బ్లూమ్‌బెర్గ్ నివేదిక ద్వారా వెల్లడించింది. బ్లాక్‌చెయిన్ అప్లికేషన్ బ్లాక్‌రాక్‌ని దాని మనీ మార్కెట్ ఫండ్‌లలో ఒకదాని నుంచి డిజిటల్ టోకెన్‌లుగా మార్చేందుకు వీలు కల్పించింది. సాంప్రదాయ పద్ధతుల కంటే టోకనైజ్డ్ కొలేటరల్ నెట్‌వర్క్ TCN వేగం, ప్రయోజనం ఎక్కువగా నిర్థారణ అయ్యింది.