LOADING...
1June Rule Change:జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలు..గ్యాస్ నుంచి బ్యాంకింగ్ వరకు మీపై ఎలా ప్రభావం చూపనుందో తెలుసా?
జూన్ 1 నుంచి కీలక మార్పులు.. సామాన్యులకు బిగ్ అలర్ట్!

1June Rule Change:జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలు..గ్యాస్ నుంచి బ్యాంకింగ్ వరకు మీపై ఎలా ప్రభావం చూపనుందో తెలుసా?

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 01, 2026
10:22 am

ఈ వార్తాకథనం ఏంటి

జూన్ నెల ప్రారంభంతో దేశవ్యాప్తంగా పలు కీలక నిబంధనలు అమల్లోకి వచ్చాయి. బ్యాంకింగ్ సేవలు, ఎల్పీజీ సిలిండర్ ధరలు, యూపీఐ లావాదేవీలు, సోలార్ ప్యానెల్ ఏర్పాటు, వాహనాల ధరలు, ఇంధన రంగానికి సంబంధించిన ఈ మార్పులు నేరుగా సామాన్యులపై ప్రభావం చూపనున్నాయి. గ్యాస్ బుకింగ్ చేయాలనుకుంటున్నా, ఆన్‌లైన్ చెల్లింపులు జరపాలనుకున్నా, బ్యాంకులో నగదు జమ చేయాలనుకున్నా లేదా కొత్త కారు కొనుగోలు చేయాలనుకున్నా తాజా నిబంధనలను తెలుసుకోవడం అవసరం.

వివరాలు 

ఎల్పీజీ ధరల్లో మార్పులు

ప్రతి నెల మొదటి తేదీన చమురు మార్కెటింగ్ సంస్థలు ఎల్పీజీ సిలిండర్ల ధరలను సమీక్షిస్తాయి. జూన్ 1 నుంచి వాణిజ్య అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్లు, చిన్న సిలిండర్ల ధరలను సవరించారు. గృహ వినియోగ సిలిండర్ల ధరలపైనా సమీక్ష కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఎల్పీజీ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో గృహ వినియోగదారులపై కూడా ధరల భారం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

వివరాలు 

యూపీఐ లావాదేవీలకు అదనపు భద్రత

డిజిటల్ చెల్లింపులను మరింత సురక్షితంగా మార్చేందుకు జూన్ నుంచి యూపీఐ వ్యవస్థలో కొన్ని కొత్త మార్పులు అమలులోకి వచ్చాయి. ఇకపై అనేక యూపీఐ లావాదేవీల సమయంలో డబ్బు పంపే ముందు లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతా వివరాలు వినియోగదారుడికి కనిపించేలా చర్యలు తీసుకున్నారు. దీని వల్ల పొరపాటున తప్పు ఖాతాకు డబ్బు వెళ్లే అవకాశాలు తగ్గడంతో పాటు ఆన్‌లైన్ మోసాలను కూడా నియంత్రించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

వివరాలు 

పాన్-ఆధార్ లింక్ తప్పనిసరి

పాన్ కార్డు, ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి గుర్తు చేస్తోంది. ఇంకా ఈ ప్రక్రియ పూర్తి చేయని వారు బ్యాంకింగ్ సేవలు, పన్ను సంబంధిత లావాదేవీల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. పలు ఆర్థిక సేవలకు చెల్లుబాటు అయ్యే పాన్ కార్డు అవసరం కావడంతో లింకింగ్ పూర్తి చేయడం కీలకంగా మారింది. బ్యాంకింగ్ సేవల్లో మార్పులు జూన్ నెల నుంచి కొన్ని బ్యాంకులు నగదు డిపాజిట్లు, చిన్న నోట్ల జమకు సంబంధించిన నిబంధనలను సవరించాయి. బ్యాంకులు తమ సేవా నిబంధనలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుండటంతో ఖాతాదారులు సేవా రుసుములు, బ్యాంకింగ్ ఛార్జీలపై తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

వివరాలు 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాదారులకు కీలక సమాచారం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చిన్న నోట్లు, నాణేల డిపాజిట్లకు సంబంధించి కొత్త నిబంధనలు అమలు చేసింది. రూ.20 లేదా అంతకంటే తక్కువ విలువ కలిగిన నోట్లకు నెలవారీ డిపాజిట్ పరిమితిని రూ.10,000గా నిర్ణయించింది. అలాగే నాణేల డిపాజిట్లకు నెలకు రూ.5,000 పరిమితిని విధించింది. ఈ పరిమితిని మించి జమ చేస్తే అదనంగా 2 శాతం రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

వివరాలు 

సోలార్ ప్యానెళ్లపై కొత్త నిబంధనలు

ఇళ్లపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి కూడా కొత్త మార్పులు వర్తించనున్నాయి. రాయితీలు పొందే ప్రాజెక్టుల్లో ప్రభుత్వం ఆమోదించిన మోడల్ అండ్ మాన్యుఫ్యాక్చరర్స్ జాబితాలో ఉన్న కంపెనీల సోలార్ మాడ్యూల్స్, సెల్స్‌ను మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది. దీని వల్ల నాణ్యత మెరుగుపడటంతో పాటు దేశీయ తయారీ రంగానికి ఊతం లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే కొన్ని ప్రాజెక్టుల వ్యయం పెరిగే అవకాశం ఉందని అంచనా.

వివరాలు 

కారు కొనుగోలుదారులకు అదనపు భారం

జూన్ నెల ప్రారంభంతో వాహనాల ధరలు కూడా పెరిగాయి. మారుతి సుజుకి తన పలు మోడళ్ల ధరలను రూ.30 వేల వరకు పెంచగా, హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా కొన్ని కార్ల ధరలను సవరించింది. దీంతో కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారు గతంతో పోలిస్తే ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి రావచ్చు.

వివరాలు 

పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పెరుగుదల నేపథ్యంలో ఇంధన ధరలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. జూన్ 1 నుంచి పెట్రోల్, డీజిల్, ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)పై సవరించిన ఎగుమతి సుంకాలు అమల్లోకి వచ్చాయి. పెట్రోల్‌పై లీటరుకు రూ.1.5, డీజిల్‌పై రూ.13.5, ATFపై రూ.9.5 మేర ఎగుమతి సుంకాలను తగ్గించారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు అధికంగానే కొనసాగితే భవిష్యత్తులో ఇంధన ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

వివరాలు 

సరిహద్దు వాణిజ్యం ప్రారంభం:

హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లా రెకాంగ్ పియో సమీపంలోని షిప్కి-లా కనుమ ద్వారా భారత్-చైనా సరిహద్దు వాణిజ్యం జూన్ 1 నుంచి తిరిగి ప్రారంభమైంది. ఈ వాణిజ్య మార్గం ద్వారా 20 రకాల వస్తువులను దిగుమతి చేసుకోవడంతో పాటు సుమారు 36 రకాల వస్తువులను ఎగుమతి చేసే అవకాశం లభించనుంది.

వివరాలు 

ప్రజలపై ప్రభావం ఎలా ఉంటుంది?

జూన్ నెలలో అమల్లోకి వచ్చిన ఈ మార్పులు గ్యాస్, బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులు, సోలార్ రంగం, వాహనాలు, ఇంధన రంగాలపై ప్రభావం చూపనున్నాయి. అందువల్ల గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడం నుంచి బ్యాంకులో నగదు జమ చేయడం వరకు, కారు కొనుగోలు నుంచి సోలార్ ప్యానెల్ ఏర్పాటు వరకు ప్రతి నిర్ణయం తీసుకునే ముందు తాజా నిబంధనలను తెలుసుకోవడం అవసరం. ఇలా ముందుగానే అవగాహన కలిగి ఉంటే అదనపు ఖర్చులు, అనవసర ఇబ్బందులను నివారించవచ్చు.

Advertisement