LOADING...
February 1 Rule Changes: ఫిబ్రవరి 1 నుంచి కీలక మార్పులు.. ఫాస్టాగ్‌ నుంచి ఎల్పీజీ ధరల్లో మార్పులు ఇవే!
ఫిబ్రవరి 1 నుంచి కీలక మార్పులు.. ఫాస్టాగ్‌ నుంచి ఎల్పీజీ ధరల్లో మార్పులు ఇవే!

February 1 Rule Changes: ఫిబ్రవరి 1 నుంచి కీలక మార్పులు.. ఫాస్టాగ్‌ నుంచి ఎల్పీజీ ధరల్లో మార్పులు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 31, 2026
03:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ 2026ను ప్రవేశపెట్టనున్నారు. ఇదే తేదీ నుంచి దేశవ్యాప్తంగా పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. పొగాకు ఉత్పత్తులపై పన్నుల పెంపు నుంచి FASTag నిబంధనల మార్పులు, ఇంధన ధరల సవరణల వరకు సాధారణ ప్రజలను ప్రభావితం చేసే నిర్ణయాలు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ మార్పులపై ఒక చూపు వేయండి..

Details

పొగాకు, పాన్‌మసాలా ధరలు పెరుగుతాయి

ఫిబ్రవరి 1, 2026 నుంచి పాన్‌మసాలా, సిగరెట్లు, పొగాకు తదితర పొగాకు సంబంధిత ఉత్పత్తులపై వస్తు సేవల పన్ను (GST)ను 40 శాతానికి పెంచారు. అయితే బీడీలపై మాత్రం 18 శాతం జీఎస్టీ విధించనున్నారు. అదనంగా పాన్‌మసాలాపై ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్ విధించనున్నారు. దీంతో పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం మరింత పెరిగే అవకాశం ఉండటంతో రిటైల్ ధరలు భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Details

మరింత సులభతరమైన FASTag సేవలు

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) FASTag నిబంధనల్లో కీలక మార్పులు ప్రకటించింది. ఫిబ్రవరి 1 నుంచి FASTag యాక్టివేషన్ అనంతరం KYC వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. FASTagలను జారీ చేసే బ్యాంకులే వాహన వివరాల ధృవీకరణ బాధ్యత తీసుకుంటాయి. దీంతో వినియోగదారులకు ఈ ప్రక్రియ మరింత సులభంగా మారనుంది.

Advertisement

Details

బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్లు ఓపెన్

ఈ ఏడాది తొలిసారి బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్లు పనిచేయనున్నాయి. ఫిబ్రవరి 1న NSE, BSE రెండూ ఉదయం 9:15 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు సాధారణ సమయాల్లోనే కొనసాగుతాయి. ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో ఆ రోజు మార్కెట్లలో భారీ ఒడిదుడుకులు కనిపించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Details

LPG సిలిండర్ ధరల్లో మార్పులు

ఫిబ్రవరి 1న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కొత్త LPG సిలిండర్ ధరలను ప్రకటించే అవకాశముంది. 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌తో పాటు గృహ వినియోగ సిలిండర్ల ధరల్లో మార్పులు చోటుచేసుకునే సూచనలు ఉన్నాయి. గత కొన్ని నెలలుగా ధరలు తరచుగా మారుతుండటంతో, ఈ నిర్ణయం మధ్యతరగతి కుటుంబాలపై మరింత ప్రభావం చూపే అవకాశముంది.

Details

CNG, PNG, విమాన ఇంధన ధరలపై ప్రభావం

ఫిబ్రవరి 1 నుంచి CNG, PNGతో పాటు విమాన టర్బైన్ ఇంధన ధరల్లో కూడా మార్పులు ఉండే అవకాశం ఉంది. CNG, PNG ధరలు పెరిగితే ఇంటి ఖర్చులు, రవాణా వ్యయాలు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో విమాన ఇంధన ధరల సవరణ వల్ల విమాన టికెట్ ఛార్జీలపై ప్రభావం పడే సూచనలు ఉన్నాయి. మొత్తంగా ఫిబ్రవరి 1, 2026 నుంచి అమల్లోకి వచ్చే ఈ మార్పులు రోజువారీ ఖర్చులు, ప్రయాణ వ్యయాలు, ఇంటి బడ్జెట్‌పై గణనీయమైన ప్రభావం చూపనున్నాయి. పన్నులు, ఇంధన ధరలు, FASTag నిబంధనలు, కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌తో సాధారణ ప్రజల ఖర్చులు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Advertisement