LOADING...
Budget 2026: బడ్జెట్‌లో వెండిపై కీలక నిర్ణయం?.. ధరలు తగ్గుతాయా లేక పెరుగుతాయా?
బడ్జెట్‌లో వెండిపై కీలక నిర్ణయం?.. ధరలు తగ్గుతాయా లేక పెరుగుతాయా?

Budget 2026: బడ్జెట్‌లో వెండిపై కీలక నిర్ణయం?.. ధరలు తగ్గుతాయా లేక పెరుగుతాయా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 25, 2026
09:46 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌ తన వెండి అవసరాల్లో పెద్ద భాగాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. పెరుగుతున్న వెండి దిగుమతి బిల్లును నియంత్రించేందుకు రాబోయే సాధారణ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెండిపై దిగుమతి సుంకాన్ని పెంచే అవకాశం ఉందన్న అంచనాలు మార్కెట్లో వ్యక్తమవుతున్నాయి. ఈ భయమే ఇప్పటికే వెండి మార్కెట్లో సంచలనాన్ని సృష్టించింది. ఫలితంగా ప్రస్తుతం వెండి భారీ ప్రీమియంతో వర్తకం అవుతోంది. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం డిసెంబర్ నెలలో వెండి దిగుమతులు గత నెలతో పోలిస్తే 79.7శాతం పెరిగి0.76 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అలాగే ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు గల కాలంలో వెండి దిగుమతులు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 129శాతం పెరిగి 7.77బిలియన్ డాలర్లకు చేరాయి.

Details

పండగ సీజన్లో గరిష్ట స్థాయికి వెండి

గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో ఈ విలువ 3.39 బిలియన్ డాలర్లుగా మాత్రమే నమోదైంది. సాధారణంగా వెండి దిగుమతులు పండుగ సీజన్‌లో గరిష్ట స్థాయికి చేరుతాయి. అయితే ఈ ఏడాది పండుగ సీజన్ ముగిసిన తర్వాత కూడా దిగుమతుల్లో పదునైన పెరుగుదల కొనసాగడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. గతేడాది బడ్జెట్‌లో ప్రభుత్వం వెండిపై దిగుమతి సుంకాన్ని 12 శాతం నుంచి 6 శాతానికి తగ్గించింది. అక్రమ రవాణాను అడ్డుకోవడం, దేశీయ మార్కెట్లో వెండి లభ్యతను పెంచడం ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది. ప్రస్తుతం వెండిపై 6 శాతం కస్టమ్స్ సుంకంతో పాటు 3 శాతం జీఎస్టీ అమలులో ఉంది.

Details

వెండిపై దిగుమతి సుంకాన్ని మళ్లీ పెంచవచ్చు

ఈ రెండు పన్నుల ఆధారంగానే దేశీయ మార్కెట్లో వెండి కొనుగోలు, విక్రయ ధరలు నిర్ణయించబడుతున్నాయి. అయితే డిమాండ్ గణనీయంగా పెరగడం కారణంగా వెండి దిగుమతులు అనూహ్యంగా పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈపరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం వెండిపై దిగుమతి సుంకాన్ని మళ్లీ పెంచవచ్చన్న చర్చలు బులియన్ మార్కెట్లో ఊపందుకున్నాయి. ఈవిషయంలో ఇంకా స్పష్టమైన సంకేతాలు లేనప్పటికీ, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే దిగుమతి సుంకం పెరిగే అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చలేమని ట్రేడ్‌బుల్స్ సెక్యూరిటీస్‌కు చెందిన భావిక్ పటేల్ వ్యాఖ్యానించారు. ఈభయం కారణంగానే బులియన్ డీలర్లు ఇప్పటికే వెండి ధరలపై ప్రీమియం వసూలు చేస్తున్నారని ఆయన తెలిపారు. దిగుమతి సుంకం పెరిగితే దేశీయ మార్కెట్లో వెండి ధరలు మరింత ఎగబాకే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement