FIEO: భారత్ హార్డ్‌వేర్ ఎగుమతుల్లో కీలకమైన వృద్ధి.. గ్లోబల్ హబ్‌గా అభివృద్ధి
భారత హార్డ్‌వేర్ రంగం గ్లోబల్ ఎగుమతుల్లో కీలక దశకు చేరుకుంటోంది. భారత ఎగుమతి సంస్థల సమాఖ్య సీఈవో అశ్వనీ కుమార్, డిసెంబర్ 6న ప్రగతి మైదాన్‌లో ప్రారంభమైన ఇంటర్నేషనల్ హార్డ్‌వేర్ ఫెయిర్ ఇండియా రెండో ఎడిషన్‌లో ఈ విషయం వివరించారు. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా భారత్‌ను అభివృద్ధి చేయడమే తమ ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని పేర్కొన్నారు. హార్డ్‌వేర్ రంగం తయారీ, నిర్మాణం, సాంకేతికత వంటి పరిశ్రమలకు వెన్నెముకలా నిలుస్తుందని అశ్వనీ కుమార్ అభిప్రాయపడ్డారు.
5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
2023లో ఈ రంగం 15% వార్షిక వృద్ధిని నమోదు చేయగా, 2027 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా ముందుకువెళ్తోంది. FIEO డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్, భారత్ ఎగుమతుల్లో గణనీయమైన పురోగతి సాధిస్తుందని వెల్లడించారు. 478 బిలియన్ డాలర్ల ఎగుమతుల నుంచి 778 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందడం 8% వార్షిక వృద్ధి రేటును సూచిస్తోందని ఆయన చెప్పారు. 2030 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యంతో, 14% CAGRను సాధించడానికి వ్యూహాత్మక కార్యక్రమాలు రూపొందించినట్లు తెలిపారు. ఈ ఫెయిర్‌లో చైనా, కొరియా, ఇటలీ, తైవాన్ సహా 35 దేశాల నుండి దాదాపు 250 ఎగ్జిబిటర్స్ పాల్గొన్నారు. 10,000 పైగా ట్రేడ్ విజిటర్స్ హాజరయ్యారు.
2029 నాటికి 6.26 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం
భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధితో పాటు హార్డ్‌వేర్, నిర్మాణ సామగ్రికి పెరుగుతున్న డిమాండ్‌ను తేటతెల్లం చేశారని Koelnmesse Pvt Ltd మేనేజింగ్ డైరెక్టర్ మిలింద్ దీక్షిత్ చెప్పారు. భారత ఫర్నిచర్ హార్డ్‌వేర్ మార్కెట్ 2024 నుంచి 2029 వరకు 15.49% వృద్ధిని సాధించనుంది. ఈ మార్కెట్ 2024లో 3.04 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2029 నాటికి 6.26 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా ఉంది. ఈ ఈవెంట్ భారత ఎగుమతుల సామర్థ్యాన్ని ఆవిష్కరించే ఒక ప్రధాన వేదికగా నిలిచింది.