
Working hours:'వారానికి 90 గంటల పని'పై వ్యాఖ్యలు.. 'నా భార్య కూడా బాధ పడింది: ఎల్ అండ్ టి చైర్మన్
ఈ వార్తాకథనం ఏంటి
ఎల్ అండ్ టీ సీఎండీ ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్ వారానికి 90 గంటలపాటు పనిచేయాలని, ఆదివారం సెలవు కూడా తీసుకోకూడదని చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై ప్రముఖులు సహా అనేకమంది తీవ్రంగా స్పందించి వ్యతిరేకత వ్యక్తం చేశారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన సుబ్రహ్మణ్యన్, తాను అప్పట్లో చెప్పిన మాటలపై విచారం వ్యక్తం చేశారు.
వివరాలు
ఇకపై ఇలాంటి అంశాలపై మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటా: ఎల్ అండ్ టి చైర్మన్
భార్యను ఎంతసేపు చూడగలరు అన్న వ్యాఖ్యలు చేసినందుకు తన భార్య కూడా బాధపడిందని చెప్పారు. ఇకపై ఇలాంటి అంశాలపై మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. తన ఆ వ్యాఖ్యలు కావాలని చేసినవి కాదని, అప్పట్లో కంపెనీకి సంబంధించిన కొన్ని కీలక ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయనే ఫిర్యాదులు రావడంతో ఆ సందర్భంలో ఆ మాటలు అప్పుడు అన్నట్లు ఆయన తెలిపారు. ఉద్దేశపూర్వకంగా మాట్లాడినవి కాదని, కేవలం ఆ సమయంలో ఏర్పడిన పరిస్థితుల కారణంగానే ఆ వ్యాఖ్యలు వెలువడ్డాయని ఆయన వివరించారు.