
Zomato: 500 మందికి పైగా ఉద్యోగులను తొలగించిన జొమాటో!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) తన ఉద్యోగులను తొలగించింది.
కస్టమర్ సపోర్ట్ అసోసియేట్లుగా పనిచేస్తున్న 500 మందికి పైగా ఉద్యోగులను ఇంటికి పంపినట్లు తెలుస్తోంది.
ఈ తొలగింపులు ఆ సంస్థ నియామకాన్ని చేపట్టిన ఏడాది కన్నా తక్కువ సమయంలో జరిగాయి.
ఈ విషయం గురించి ఆంగ్ల మీడియా కథనాలు వెలువడుతున్నాయి.జొమాటో తన క్విక్ కామర్స్ విభాగం అయిన బ్లింకిట్ వృద్ధిలో మందగమనాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ వార్తలు వెలువడటం గమనార్హం.
జొమాటో అసోసియేట్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ (ZAAP) పేరిట ఒక సంవత్సరం క్రితం ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ నియామకాలు ప్రారంభించింది.
వివరాలు
కస్టమర్ సపోర్ట్ విభాగంలో 1500 మంది
కస్టమర్ సపోర్ట్ విభాగంలో 1500 మందిని నియమించుకుంది.వీరిలో కొంతమందిని పేలవమైన పనితీరు, సమయపాలన పాటించకపోవడం వంటి కారణాల వల్ల నోటీసు పీరియడ్ ఇవ్వకుండా తొలగించింది.
వీరికి ఒక్క నెల జీతాన్ని పరిహారంగా ఇవ్వడం జరిగిందని సంబంధిత వ్యక్తులు తెలిపారు. వీరికి స్పష్టమైన వివరణ లేకుండా ఇంటికి పంపించారు.
కస్టమర్ సపోర్ట్ విభాగాన్ని ఆటోమేట్ చేయడం,అలాగే ఖర్చులను తగ్గించుకోవడం కోసం కృత్రిమ మేధ (AI)ను ఉపయోగించాలని జొమాటో చూస్తోంది.
ఈ పరిణామం కూడా ఈ లేఆఫ్‌లకు కారణమని అంచనా వేయబడుతుంది.
వివరాలు
క్విక్ కామర్స్ విభాగంలో పెరిగిన పోటీ.. బ్లింకిట్ నష్టాలు
ఈ చర్యలు కారణంగా ఆ విభాగంలో పనిచేసే ఉద్యోగులు ఉపాధి కోల్పోతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే జొమాటో యాజమాన్యం నుంచి ఈ లేఆఫ్‌ల గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇతర వార్తల్లో, జొమాటో ఫుడ్ డెలివరీ వ్యాపారంలో మందగమనం ఉందని ప్రకటించింది.
క్విక్ కామర్స్ విభాగంలో పెరిగిన పోటీ కారణంగా బ్లింకిట్ నష్టాలు మూటగట్టుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో, లేఆఫ్‌ల వార్తలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.