Gold Prices: బంగారం ధరలకు భారీ షాక్.. ఒక్కరోజులోనే భారీ పతనం.. తాజా ధరలు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
కొద్ది రోజులుగా వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. గత రెండు రోజులుగా పసిడి ధరలు క్రమంగా దిగివస్తూ వినియోగదారులకు ఊరటనిస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతోనే ఈ తగ్గుదల కనిపిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు సాగుతుండటం, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కాస్త సద్దుమణగడం వల్ల బంగారం ధరలు పడిపోతున్నాయి. ఇరాన్‌తో త్వరలోనే శాంతి ఒప్పందం కుదిరే అవకాశముందని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యల తర్వాత పసిడి ధరల్లో మరింత తగ్గుదల నమోదైంది.
వివరాలు
బంగారం ధర
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.1,58,290గా ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే రూ.600 తగ్గింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,100 వద్ద కొనసాగుతుండగా.. ఒక్కరోజులోనే రూ.550 తగ్గింది. విజయవాడ, విశాఖపట్నాల్లో కూడా ఇదే ధరలు అమలులో ఉన్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,820 వద్ద కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే రూ.870 వరకు తగ్గుదల నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,500గా ఉండగా.. రూ.800 మేర పతనమైంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,58,290గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,45,100 వద్ద కొనసాగుతోంది.
వివరాలు
వెండి ధర
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,58,440గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.600 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,250 వద్ద కొనసాగుతుండగా.. ఒక్కరోజులోనే రూ.550 మేర పడిపోయింది. మరోవైపు వెండి ధరల్లో మాత్రం పెద్దగా మార్పులు కనిపించలేదు. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2.85 లక్షల వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2.90 లక్షలుగా ఉంది. నిన్నటి ధర రూ.2.95 లక్షలు ఉండగా.. ప్రస్తుతం రూ.5 వేల మేర తగ్గింది. చెన్నైలో కూడా కిలో వెండి ధర రూ.2.90 లక్షల వద్ద కొనసాగుతుండగా.. బెంగళూరులో రూ.2.85 లక్షలుగా నమోదైంది.