Gold Prices: ఒక్కసారిగా దిగివచ్చిన బంగారం,వెండి ధరలు .. ఇప్పుడు తులం ఎంత ఉందంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
గత కొద్ది రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు శుక్రవారం బ్రేక్ పడింది. ఒక్కరోజులోనే పసిడి ధరలు భారీగా తగ్గడంతో కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది ఊరటనిచ్చే పరిణామంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకునే పరిణామాలకు అనుగుణంగా బంగారం ధరలు మారుతూ ఉంటాయి. యుద్ధాలు,రాజకీయ అనిశ్చితి,ఆర్థిక సంక్షోభం,ద్రవ్యోల్బణం వంటి అంశాలు బంగారం ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంటాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10గ్రాముల 24క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.1,44,330గా ఉంది. శుక్రవారం ఒక్కరోజులోనే ఈ ధర రూ.1,850 తగ్గింది.అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,300 వద్ద కొనసాగుతుండగా, ఇందులో రూ.1,700 తగ్గుదల నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
వివరాలు
వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?
చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,330గా ఉండగా, శుక్రవారం ఒక్కరోజే రూ.2,950 తగ్గింది.
22 క్యారెట్ల బంగారం ధర రూ.1,32,300 వద్ద కొనసాగుతుండగా,ఇందులో రూ.2,700 తగ్గుదల నమోదైంది.
బెంగళూరులో కూడా 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,330గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,32,300 వద్ద ట్రేడవుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,480గా ఉంది.
అక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,32,450 వద్ద కొనసాగుతోంది. అటు వెండి ధరల్లో కూడా గణనీయమైన తగ్గుదల కనిపించింది.
వివరాలు
వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?
ఢిల్లీలో కిలో వెండి ధర ఒక్కరోజులో రూ.5 వేల మేర పడిపోయింది. గురువారం రూ.2.40 లక్షలుగా ఉన్న ధర శుక్రవారం రూ.2.35 లక్షలకు చేరుకుంది.
హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.40 లక్షలుగా ఉంది.
గురువారం ఇది రూ.2.45 లక్షలుగా ఉండగా, శుక్రవారం రూ.5 వేల మేర తగ్గింది.
చెన్నైలో కూడా కిలో వెండి ధర రూ.2.40 లక్షల వద్ద కొనసాగుతుండగా, బెంగళూరులో కిలో వెండి రూ.2.35 లక్షల వద్ద ట్రేడవుతోంది.