LOADING...
Amazon:  అమెజాన్‌లో లేఆఫ్స్‌.. 1,800 ఇంజినీర్ల ఉద్యోగాలు కోత
అమెజాన్‌లో లేఆఫ్స్‌.. 1,800 ఇంజినీర్ల ఉద్యోగాలు కోత

Amazon:  అమెజాన్‌లో లేఆఫ్స్‌.. 1,800 ఇంజినీర్ల ఉద్యోగాలు కోత

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 22, 2025
02:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్ 14,000 కార్పొరేట్‌ ఉద్యోగాలను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఈ లేఆఫ్స్‌ కంపెనీ యొక్క క్లౌడ్ సర్వీసులు, రిటైల్, అడ్వర్టైజింగ్, గ్రోసరీ వంటి విభాగాల్లో జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇంజినీర్ల బృందంపై ఈ లేఆఫ్ ప్రభావం గణనీయంగా ఉంది. న్యూయార్క్‌, కాలిఫోర్నియా, న్యూజెర్సీ, వాషింగ్టన్‌లో లేఆఫ్ రికార్డుల ప్రకారం, ఈ నాలుగు రాష్ట్రాల్లో 4,700 మందికి పైగా ఉద్యోగులు లేఆఫ్ జాబితాలో ఉన్నారు. ఇందులో 40% మంది ఇంజినీర్లు ఉంటారని తెలుస్తోంది, అంటే సుమారు 1,800 ఇంజినీర్ల పై ప్రభావం చూపుతోంది. ఇంటర్నేషనల్‌ మీడియా కథనం ప్రకారం, మిగతా రాష్ట్రాల్లో అమెజాన్ తన తొలగింపుల డేటాను బహిర్గతం చేస్తే, ఏ విభాగంలో ఎంతమంది ఉద్యోగులు తొలగించబడ్డారన్న అంశంపై స్పష్టత తెలుస్తుందని పేర్కొంది.

Details

గతంలో కూడా భారీ లేఆఫ్స్

అమెజాన్ అక్టోబర్‌లో ఈ జాబ్ కట్ల గురించీ ప్రకటించినప్పుడు, కంపెనీ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) కోసం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టుతోందన్నారు. అలాగే కస్టమర్ల ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త పథకంలో ముందుకు సాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అమెజాన్ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్ బెతత్ గలెట్టి ఉద్యోగులకు రాసిన సందేశంలో కంపెనీ బ్యూరోక్రసీని తగ్గించడం, అనవసర లేయర్లను తొలగించడం, వనరులను సంపూర్ణంగా వినియోగించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. కంపెనీ సీఈఓ యాండీ జెస్సీ కూడా పలుమార్లు పేర్కొన్నారు, ప్రస్తుత పరిస్థితులు ఏఐ శకంకి చెందినవే అని, ఇదే నేపథ్యంలో ఈ భారీ లేఆఫ్‌ల ప్రకటన వెల్లడించబడింది.