Lenskart IPO: లెన్స్‌కార్ట్ IPO అలాట్మెంట్ ఈరోజే: ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవచ్చు?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ కళ్ళద్దాల కంపెనీ లెన్స్‌కార్ట్ IPO అలాట్మెంట్ ప్రక్రియను ఈరోజు ఫైనల్ చేయనుంది. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 4 వరకు జరిగిన సబ్‌స్క్రిప్షన్ సమయంలో ఈ IPO కు పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన వచ్చింది. మొత్తం మీద ఈ IPO కు 28.27 రెట్లు డిమాండ్ నమోదైంది.
సబ్‌స్క్రిప్షన్ బ్రేక్‌డౌన్
రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 7.56 రెట్లు సబ్‌స్క్రిప్షన్
రిటైల్ కేటగిరీలో 7.56 రెట్లు డిమాండ్ ఉండగా, QIB (Qualified Institutional Buyers) కేటగిరీకి 40.36 రెట్లు, NII (Non-Institutional Investors) కేటగిరీకి 18.23 రెట్లు సబ్‌స్క్రిప్షన్ నమోదయింది. IPO లో దాదాపు 1 బిలియన్ షేర్లు రూ. 382 - రూ. 402 ధర బాండ్‌తో అందించారు. మొత్తం మీద కంపెనీ ₹7,278 కోట్లు సమీకరించాలనే లక్ష్యంతో ఈ పబ్లిక్ ఇష్యూ తీసుకు వచ్చింది.
కేటాయింపు తనిఖీ
BSE లో లెన్స్‌కార్ట్ IPO అలాట్మెంట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
1. ముందుగా BSE Website ఓపెన్ చేయాలి. 2. 'Equity' సెక్షన్‌లోకి వెళ్లాలి. 3. అక్కడ నుంచి Lenskart Solutions Limited ను సెలెక్ట్ చేయాలి. 4. తరువాత మీ Application Number మరియు PAN వివరాలు నమోదు చేసి 5. Search కొట్టితే అలాట్మెంట్ స్టేటస్ కనిపిస్తుంది.
పోర్టల్ వినియోగం
MUFG Intime India వెబ్‌సైట్ ద్వారా కూడా చెక్ చేయవచ్చు
MUFG Intime India (మునుపటి Link Intime) పోర్టల్‌లోకి వెళ్లాలి. లిస్టులో నుంచి Lenskart Solutions Limited ను సెలెక్ట్ చేయాలి. మీరు Application Number / Demat Account Number / PAN ద్వారా సెర్చ్ చేయవచ్చు. వివరాలు, Captcha నమోదు చేసిన తర్వాత Submit చేయాలి. షేర్లు రాని వారికి రిఫండ్ ప్రాసెస్ అవుతుంది. షేర్లు వచ్చిన వారికి వాటాలు డైరెక్ట్‌గా డీమాట్ అకౌంట్ లోకి క్రెడిట్ అవుతాయి.
మార్కెట్ అంచనాలు
లెన్స్‌కార్ట్ GMP క్షీణత.. లిస్టింగ్ రోజు బలహీన ప్రదర్శన అవకాశం?
విచిత్రం ఏమిటంటే IPO కు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, ఇటీవల గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) గణనీయంగా తగ్గింది. ఒకప్పుడు ₹108 వరకు ఉన్న GMP ఇప్పుడు ₹35 కు పడిపోయిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. లెన్స్‌కార్ట్ షేర్లు నవంబర్ 10న BSE మరియు NSE లో లిస్ట్ కానున్నాయి.