
LG Electronics IPO: ఎంట్రీలోనే అదరగొట్టిన ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్.. 50 శాతం ప్రీమియంతో అరంగేట్రం
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్‌జీకి చెందిన అనుబంధ సంస్థ ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ (LG Electronics IPO) మంగళవారం స్టాక్‌మార్కెట్‌లో అరంగేట్రం చేసింది. ఆ కంపెనీ షేర్లు ఎంట్రీలోనే అదరగొట్టాయి. దలాల్ స్ట్రీట్‌లో 50 శాతం ప్రీమియంతో షేర్లు లిస్టింగ్ అయ్యాయి. పబ్లిక్ ఇష్యూలో భాగంగా ఒక్కో షేరు ధరను ₹1,080 - ₹1,140 రేంజ్‌లో నిర్ణయించగా, ఇష్యూ ధరతో పోలిస్తే BSEలో ₹1,715, NSEలో ₹1,710 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. దీని వలన ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుపై కనీసం ₹570 - ₹575 లాభం కనిపించింది. కాగా, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ ఐపీఓకు అనూహ్యమైన స్పందన లభించింది. బిడ్డింగ్ విండో తెరిచిన మొదటి రోజే ఐపీఓ పూర్తి సబ్‌స్క్రైబ్ అయ్యింది.
వివరాలు
వివిధ కోటాలు ఇలా సబ్‌స్క్రైబ్ అయ్యాయి:
NSE డేటా ప్రకారం, 7,13,34,320 షేర్లకు 7,44,73,685 బిడ్లు దాఖలు అయ్యాయి. అంటే 1.04 రెట్లు ఓవర్ సబ్‌స్క్రిప్షన్ జరిగింది. నాన్ ఇన్‌స్టిట్యూషనల్ కోటా - 2.31 రెట్లు రిటైల్ ఇన్వెస్టర్ల కోటా - 81% క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ల కోటా - 49% అల్రెడీ, యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ₹3,475 కోట్లను ఎల్‌జీ సమీకరించింది. మొత్తం ₹11,607 కోట్ల ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ అక్టోబర్ 9న ముగిసింది. 10.2 కోట్ల షేర్లను విక్రయించి ₹15,000 కోట్ల లక్ష్యాన్ని సమీకరించేందుకు ఈ ఐపీఓను ఎల్‌జీ తీసుకువచ్చింది. 2025లో వచ్చిన అత్యంత పెద్ద ఐపీఓ ఇదే అని చెప్పడం గమనార్హం.