
LG: ఆంధ్రప్రదేశ్‌లో ₹5,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఎల్జి.. 11,000+ వేల పరోక్ష ఉద్యోగాలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతోంది.
దీనికి సంబంధించిన సమాచారం ఒక ట్వీట్ రూపంలో సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే, తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో రూ.5,000 కోట్ల విలువైన కొత్త ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించేందుకు సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఈ విషయాన్ని శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
వివరాలు
మే 8న శంకుస్థాపన
ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1,495 మంది ప్రత్యక్షంగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉండగా, మరోపక్క పరోక్షంగా దాదాపు 11,000 మందికి పైగా ఉపాధి లభించే అవకాశముందని అంచనా వేయబడింది.
తాజా సమాచారం ప్రకారం, ఈ కొత్త తయారీ కేంద్రానికి మే 8న శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు.
నివేదికల ప్రకారం,ఈ ప్లాంట్ మొత్తం 247 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానుంది.
ఈ కర్మాగారంలో ఫ్రిడ్జీలు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు వంటి అనేక ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి జరగనుంది.
వివరాలు
ఉత్పత్తి ప్రారంభానికి సంబంధించి ఎల్జీ ఎలక్ట్రానిక్స్ లక్ష్యం..
వచ్చే ఏడాది, అంటే డిసెంబర్ 2026 నాటికి ఈ కొత్త ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభించేందుకు సంస్థ ప్రయత్నాలు చేస్తోంది.
ఇది దక్షిణ భారతదేశంలో ఎల్జీ పెట్టనున్న అతిపెద్ద పెట్టుబడిగా గుర్తింపు పొందుతోంది.
ఇక రాష్ట్రంలోని తయారీ విధానానికి ఇది తొలిసారి ఒక ప్రముఖ తయారీ సంస్థ నుంచి వచ్చిన బలమైన సహకారం కావడం విశేషం.
ఎల్జీతో పాటు,సంస్థకు అనుబంధంగా పనిచేసే నలుగురు సప్లయర్లు కూడా ఇండియా మార్కెట్లోకి అడుగుపెడుతున్నారు.
వీరంతా కలిపి రూ.839 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు.అయితే రాబోయే నాలుగేళ్ల వ్యవధిలో ఈ మొత్తం పెట్టుబడి రూ.5,000 కోట్లను మించవచ్చని అంచనా.
ఈ పెట్టుబడులన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రూపొందించిన తయారీ విధానం ప్రకారం ఇవ్వబడుతున్న ప్రోత్సాహకాల పరిధిలోకి వస్తాయి.
వివరాలు
20 సంవత్సరాల నీటి వినియోగంపై 100% సబ్సిడీ
ఇందులో స్టాంప్ డ్యూటీ మినహాయింపు, రిజిస్ట్రేషన్ ఫీజుల మాఫీ వంటి పలు ప్రయోజనాలు ఉన్నాయి.
ఈ పెట్టుబడుల నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం ఎల్జీకి భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించింది.
తయారీ విధానంలో భాగంగా సంస్థకు అందించబడుతున్న ముఖ్యమైన లబ్ధులలో 20 సంవత్సరాల పాటు నీటి వినియోగంపై 100% సబ్సిడీ,నిర్మాణ పనులపై ఎస్‌జీఎస్టీ తిరిగి చెల్లింపు, విద్యుత్ ఛార్జీలపై మినహాయింపు, అలాగే విద్యుత్ వినియోగంపై 20 సంవత్సరాల వరకు 50% సబ్సిడీ వంటి వాటిని పేర్కొనవచ్చు.
విద్యుత్,జలవనరుల శాఖలు ఈ ప్రాజెక్టును వేగవంతంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం.
వివరాలు
ఎల్జీ సంస్థకు దేశంలో రెండు ప్రధాన ఉత్పత్తి కేంద్రాలు
శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి తెలిపిన మేరకు, ఎల్జీ సంస్థను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆకర్షించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కృషి చేశారని తెలిపారు.
ప్రస్తుతం ఎల్జీ సంస్థకు దేశంలో రెండు ప్రధాన ఉత్పత్తి కేంద్రాలున్నాయని, వాటిలో ఒకటి పుణెలో, మరొకటి నోయిడాలో ఉన్నాయని ఆయన వివరించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆంధ్రప్రదేశ్‌లో Rs.5,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఎల్జి
In possibly the largest such investment in South India, LG Electronics will be setting up a manufacturing facility in AP. #makeinindia https://t.co/QfGS6cBww8
— Shweta Punj (@shwwetapunj) May 6, 2025