Page Loader
LIC Nav Jeevan Shree:నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేస్తే.. LIC నుంచి రూ.26 లక్షలు! 
నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేస్తే.. LIC నుంచి రూ.26 లక్షలు!

LIC Nav Jeevan Shree:నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేస్తే.. LIC నుంచి రూ.26 లక్షలు! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 04, 2025
03:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తాజాగా రెండు కొత్త సేవింగ్స్ పాలసీలను ప్రారంభించింది. ఇవి నవ జీవన్ శ్రీ, నవ జీవన్ శ్రీ - సింగిల్ ప్రీమియం పేరుతో అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు ప్లాన్లు నాన్ పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్, లైఫ్ కవరేజ్ కలిగిన వ్యక్తిగత సేవింగ్ ప్లాన్లు గా ఉండనున్నాయి. ఈ పాలసీలు జూలై 4, 2025 నుంచి వచ్చే సంవత్సరం మార్చి 31, 2026 వరకు మాత్రమే లభ్యమవుతాయని LIC స్పష్టంచేసింది. బీమా రక్షణతో పాటు పెట్టుబడికి భద్రత, వడ్డీ లాభాలు కోరే వారికి ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని సంస్థ చెబుతోంది.

వివరాలు 

ఎల్‌ఐసీ నవ జీవన్‌ శ్రీ- సింగిల్‌ ప్రీమియం (ప్లాన్‌ నం.911) 

ఈ పాలసీ ఒకేసారి మొత్తం పెట్టుబడి చేయదలచుకున్న వారికి అనువుగా ఉంటుంది. ఈ పాలసీని 30 రోజుల నుండి 60 ఏళ్ల వయస్సు కలిగిన వారు తీసుకోవచ్చు. అయితే ఆప్షన్ 2 కింద మాత్రం గరిష్ఠ వయస్సు 40 ఏళ్లు మాత్రమే. మెచ్యూరిటీ సమయానికి కనీస వయస్సు 18 ఏళ్లు, గరిష్ఠంగా 75 ఏళ్లు (ఆప్షన్ 2లో 60) ఉండాలి. పాలసీ వ్యవధి కనీసం 5 సంవత్సరాలు, గరిష్ఠంగా 20 సంవత్సరాలు. కనీస హామీ మొత్తం (Sum Assured) రూ.1 లక్ష. గరిష్ఠ పరిమితి ఏమీ లేదు.

వివరాలు 

డెత్ బెనిఫిట్‌: 

ఆప్షన్ 1 కింద - సింగిల్ ప్రీమియం × 1.25 లేదా బేసిక్ సమ్ అష్యూర్డ్, ఏది ఎక్కువైతే అది చెల్లించబడుతుంది. ఆప్షన్ 2 కింద - సింగిల్ ప్రీమియానికి 10 రెట్లు రిస్క్ కవరేజీ ఉంటుంది. గ్యారెంటీడ్ అడిషన్: ప్రతి వెయ్యి రూపాయల బేసిక్ సమ్ అష్యూర్డ్‌పై రూ.85 చొప్పున గ్యారెంటీడ్ అడిషన్ అందుతుంది. పాలసీ కాలంలో LIC నుంచి యాక్సిడెంట్ డెత్ & డిజేబిలిటీ రైడర్, న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్ వంటి అదనపు రైడర్లను కూడా జోడించుకోవచ్చు. రిస్క్ లేదా మెచ్యూరిటీ సమయంలో చెల్లింపు: మొత్తాన్ని ఒకేసారి లేదా నెలవారీ, త్రైమాసిక, అర్ధవార్షిక లేదా వార్షిక పద్ధతిలో పొందే అవకాశముంది.

వివరాలు 

ఈ పాలసీని ఒక ఉదాహరణతో చూద్దాం..

18 ఏళ్ల వ్యక్తి ఐదేళ్ల పాలసీకి రూ.5 లక్షల సమ్ అష్యూర్డ్తో పాలసీ తీసుకుంటే: సింగిల్ ప్రీమియం రూ.5,39,325 చెల్లించాలి. ప్రతి ఏడాది రూ.42,500 గ్యారెంటీడ్ అడిషన్ వస్తుంది (మొత్తం రూ.2,12,500). ఐదేళ్ల తర్వాత మెచ్యూరిటీకి రూ.7,12,500 లభిస్తుంది. చివరి సంవత్సరంలో రిస్క్ జరిగితే రూ.9.17 లక్షలు LIC చెల్లిస్తుంది. ఇలా చూస్తే, పెట్టుబడికి వడ్డీతో పాటు బీమా రక్షణ కూడా లభిస్తుంది.

వివరాలు 

నవ జీవన్ శ్రీ - రెగ్యులర్ ప్రీమియం పాలసీ (ప్లాన్ నెం.912) 

ఇది విడతల వారీగా ప్రీమియం చెల్లించే వారికి అనువైన ప్లాన్. కనీస సమ్ అష్యూర్డ్ రూ.5 లక్షలు, గరిష్ఠ పరిమితి లేదు. వయస్సు పరిమితి: 30 రోజుల నుంచి 75 ఏళ్ల వరకు. మెచ్యూరిటీ వయస్సు: 18 నుండి 75 ఏళ్లు. ప్రీమియం చెల్లింపు వ్యవధులు: 6, 8, 10 లేదా 12 సంవత్సరాలు. పాలసీ టర్మ్ కనీసం 10 సంవత్సరాలు, గరిష్ఠంగా 20 సంవత్సరాలు (ఉదా: 15, 16, 20 సంవత్సరాలు) ఉండవచ్చు.

వివరాలు 

గ్యారెంటీడ్ అడిషన్లు: 

10-13 ఏళ్ల పాలసీకి - 8.50%, 14-17 సంవత్సరాలకు - 9%, 18-20 సంవత్సరాలకు - 9.50% చొప్పున లభిస్తాయి. డెత్ బెనిఫిట్‌: ఆప్షన్ 1 కింద - కనీస సమ్ అష్యూర్డ్ + వార్షిక ప్రీమియం × 7 ఆప్షన్ 2 కింద - వార్షిక ప్రీమియం × 10 + బేసిక్ సమ్ అష్యూర్డ్ అదనపు ప్రయోజనాలు: యాక్సిడెంట్ డెత్ & డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్ యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్ ప్రీమియం వెయివర్ బెనిఫిట్ రైడర్

వివరాలు 

చెల్లింపు విధానం: 

మెచ్యూరిటీ తర్వాత లేదా రిస్క్ జరిగినప్పుడు - మొత్తం డబ్బును ఒకేసారి లేదా నెలవారీ/త్రైమాసిక/అర్ధవార్షిక/వార్షిక పద్ధతిలో పొందవచ్చు. ప్రీమియం చెల్లింపును కూడా అదే విధంగా ఎంపిక చేసుకోవచ్చు. ఈ పాలసీ ప్రయోజనాలను ఉదాహరణతో చూద్దాం.. ఒక వ్యక్తి రూ.10 లక్షల సమ్ అష్యూర్డ్తో 20 ఏళ్ల పాలసీకి పాలసీ తీసుకుంటే: ఆప్షన్ 2, 10 సంవత్సరాల ప్రీమియం చెల్లింపు ఎంచుకుంటే: వార్షిక ప్రీమియం: రూ.1,10,900 నెలకు చెల్లించాలంటే: రూ.10,000 చొప్పున మొత్తం చెల్లించే సొమ్ము: రూ.11,09,000 పాలసీ చివరికి రూ.16,58,786 గ్యారెంటీడ్ అడిషన్ మొత్తం మెచ్యూరిటీ మొత్తంగా రూ.26,58,786 లభిస్తుంది. పాలసీ కాలంలో ఏదైనా ప్రమాదం జరిగినా బీమా కవరేజీ లభిస్తుంది.