LOADING...
Standard Glass Lining: స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌ ఐపీఓకు 23% ప్రీమియంతో లిస్టింగ్‌
స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌ ఐపీఓకు 23% ప్రీమియంతో లిస్టింగ్‌

Standard Glass Lining: స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌ ఐపీఓకు 23% ప్రీమియంతో లిస్టింగ్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 13, 2025
11:34 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ కంపెనీ షేర్లు సోమవారం స్టాక్‌ మార్కెట్ లో లిస్ట్ అయ్యాయి. ప్రారంభంలోనే ఈ కంపెనీ షేర్లకు పూర్తిగా సబ్‌స్క్రిప్షన్‌ అందింది. మొదటి రోజు షేర్లు 23 శాతం ప్రీమియంతో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. ఇష్యూ ధర రూ.140తో పోలిస్తే, నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.172 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. బీఎస్‌ఈలో ఈ షేర్లు 25.71 శాతం ప్రీమియంతో రూ.176 వద్ద అరంగేట్రం చేశాయి. ఫార్మా కంపెనీలకు గ్లాస్‌ లైనింగ్‌ పరికరాలు, ప్రత్యేక ఇంజినీరింగ్‌ ఉపకరణాలు, సంక్లిష్ట విడిభాగాలను సరఫరా చేసే ఈ సంస్థ, ఐపీఓ ద్వారా రూ.410.05 కోట్ల నిధులను సమీకరించాలని నిర్ణయించింది.

Details

1.43 కోట్ల షేర్లను విక్రయించిన ప్రమోటర్లు  

ఫ్రెష్‌ ఇష్యూ ద్వారా రూ.210 కోట్ల విలువైన షేర్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్ ద్వారా 1.43 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయించారు. ధర శ్రేణి రూ.133-140 మధ్య ఉండగా, సబ్‌స్క్రిప్షన్‌ చివరి రోజున 183 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఫ్రెష్‌ ఇష్యూ ద్వారా వచ్చిన నిధులను రుణాల చెల్లింపులు, సబ్సిడరీ సంస్థ ఎస్‌2 ఇంజినీరింగ్‌ ఇండస్ట్రీలో పెట్టుబడులు, వ్యూహాత్మక కొనుగోళ్లు, మెషినరీ కొనుగోలు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు ఉపయోగించేందుకు కంపెనీ నిర్ణయించింది.