LOADING...
Finance Bill 2025: ప్రభుత్వ సవరణలతో లోక్‌సభ ఆర్థిక బిల్లు 2025 ఆమోదం 
ప్రభుత్వ సవరణలతో లోక్‌సభ ఆర్థిక బిల్లు 2025 ఆమోదం

Finance Bill 2025: ప్రభుత్వ సవరణలతో లోక్‌సభ ఆర్థిక బిల్లు 2025 ఆమోదం 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 25, 2025
07:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో సవరించిన ఆర్థిక బిల్లు 2025ను ప్రవేశపెట్టారు. మంగళవారం (మార్చి 25) లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించింది, ఇందులో 35 ప్రభుత్వ సవరణలు ఉన్నాయి. ఈ సవరణల్లో ముఖ్యంగా ఆన్‌లైన్ ప్రకటనలపై 6% డిజిటల్ పన్నును తొలగించడం, గూగుల్ పన్ను నుంచి ఊరట కల్పించడం వంటి అంశాలు ఉన్నాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, బిల్లుకు సంబంధించి తదుపరి అడుగు రాజ్యసభ ఆమోదమే. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకారం, ఈ బిల్లు పన్ను చెల్లింపుదారులకు లాభదాయకంగా మారబోతుందని, మధ్యతరగతి ప్రజలు,వ్యాపార వర్గాలకు ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రభుత్వ సవరణలతో లోక్‌సభ ఆర్థిక బిల్లు 2025 ఆమోదం

వివరాలు 

వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లలో 13.14% వృద్ధి

2025-26 కేంద్ర బడ్జెట్‌లో మొత్తం వ్యయం రూ.50.65 లక్షల కోట్లుగా ప్రతిపాదించబడింది, ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 7.4% అధికం. సోమవారం (మార్చి 24) లోక్‌సభలో పన్ను సంస్కరణలపై మాట్లాడిన ఆర్థిక మంత్రి, అంతర్జాతీయ ఆర్థిక అస్థిరతను దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్ ప్రకటనలపై ఈక్వలైజేషన్ రుసుమును రద్దు చేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల ప్రభుత్వం రూ.1 లక్ష కోట్లు ఆదాయ నష్టాన్ని ఎదుర్కొనాల్సి వచ్చినప్పటికీ, 2025-26లో వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లలో 13.14% వృద్ధి సాధ్యమని వివరించారు. ప్రతిపాదిత బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వ మద్దతుతో అమలయ్యే పథకాల కోసం రూ.5,41,850.21 కోట్లు కేటాయించగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ.4,15,356.25 కోట్లుగా ఉంది.

Advertisement

వివరాలు 

రాబోయే ఆర్థిక సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి రూ.3,56,97,923 కోట్లు

కొన్ని కారణాల వల్ల 2025-26లో వ్యయం మరింత పెరిగినట్లు తెలిపారు. అదే విధంగా,2026 నాటికి ఆర్థిక లోటు 4.4%గా ఉంటుందని అంచనా వేయగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే శాతం ఉందని పేర్కొన్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి(GDP)రూ.3,56,97,923 కోట్లుగా ఉండనుందని, ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే 10%అధికమని తెలిపారు. కస్టమ్స్ సుంకంలో హేతుబద్ధమైన మార్పులు దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడమే కాకుండా, ఎగుమతులను పెంచుతాయని,ద్రవ్యోల్బణాన్ని నియంత్రించి సామాన్యులకు ఉపశమనం కలిగిస్తాయని నిర్మలా సీతారామన్ అన్నారు. కొత్త ఆదాయపుపన్ను బిల్లును పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చర్చించనున్నట్లు తెలిపారు. లోక్‌సభలో ఆర్థిక బిల్లు 2025పై చర్చ సందర్భంగా,ఫిబ్రవరి 13నప్రవేశపెట్టిన కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రస్తుతం సెలెక్ట్ కమిటీ సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement