LOADING...
Gas Cylinder: ఇజ్రాయెల్-అమెరికా దాడుల ప్రభావం.. LPG కొరతపై కేంద్రం కీలక నిర్ణయం..  
LPG కొరతపై కేంద్రం కీలక నిర్ణయం..

Gas Cylinder: ఇజ్రాయెల్-అమెరికా దాడుల ప్రభావం.. LPG కొరతపై కేంద్రం కీలక నిర్ణయం..  

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 16, 2026
05:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పెట్రోల్,డీజిల్, గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ఈ పరిణామాల మధ్య భారత్‌లో కూడా ఎల్‌పీజీ కొరత ఆందోళనకర స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపట్టింది. ఎల్‌పీజీ కొరతను తగ్గించే దిశగా ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల బుకింగ్ వ్యవధిని పెంచినట్లు తెలిపింది. అంతేకాదు, దేశవ్యాప్తంగా ఉన్న డొమెస్టిక్ LPG కనెక్షన్ వినియోగదారులందరికీ ఒక ముఖ్యమైన సూచన జారీ చేసింది. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ e-KYC ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని కేంద్రం స్పష్టం చేసింది.

వివారాలు 

గ్యాస్ సిలిండర్ కోసం ఆధార్ e-KYC ఎలా చేయాలి?

గ్యాస్ సబ్సిడీ నిరంతరంగా పొందాలన్నా, సిలిండర్ బుకింగ్‌లో ఎలాంటి అంతరాయం రాకూడదన్నా e-KYC పూర్తి చేయడం అవసరమని ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యంగా ఉజ్వల యోజన లబ్ధిదారులు ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. ఎల్‌పీజీ వినియోగదారులు తమ గ్యాస్ కనెక్షన్‌కు సంబంధించిన ఆధార్ e-KYCని చాలా సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అందుకు ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో ప్లే స్టోర్‌ ఓపెన్ చేసి Aadhaar FaceRD యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత, మీరు ప్రస్తుతం ఏ కంపెనీ గ్యాస్ సిలిండర్ ఉపయోగిస్తున్నారో, ఆ కంపెనీకి సంబంధించిన అధికారిక యాప్‌ను కూడా ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయాలి.

వివరాలు 

గ్యాస్ సిలిండర్ కోసం ఆధార్ e-KYC ఎలా చేయాలి?

యాప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, మీ కన్స్యూమర్ నంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నమోదు చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన వెంటనే యాప్‌లో కనిపించే Re-eKYC లేదా Aadhaar e-KYC ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత మీ ఆధార్ నంబర్ నమోదు చేయాలి. ఆపై నిబంధనలు, షరతులకు అంగీకరించిన తర్వాత ఫేస్ స్కాన్ ప్రక్రియను ప్రారంభించాలి. ఈ సమయంలో మీ స్క్రీన్‌పై Aadhaar FaceRD కెమెరా ఓపెన్ అవుతుంది. అందులో మీ ముఖాన్ని సరిగ్గా స్కాన్ చేయాలి. మీ ముఖం విజయవంతంగా స్కాన్ అయిన వెంటనే స్క్రీన్‌పై గ్రీన్ టిక్ మార్క్ కనిపిస్తుంది. అనంతరం మీ ఆధార్‌కు సంబంధించిన వివరాలు స్క్రీన్‌పై ప్రదర్శించబడతాయి.

Advertisement

వివరాలు 

ముఖ్య గమనిక

అవి సరిగా ఉన్నాయో లేదో చూసుకుని చివరగా Submit బటన్‌పై క్లిక్ చేస్తే e-KYC ప్రక్రియ పూర్తవుతుంది. LPG గ్యాస్ సిలిండర్ కోసం e-KYC పూర్తి చేయాలనుకునే వారు పై విధానాన్ని అనుసరించి సులభంగా ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. అయితే ఇందులో ఒక విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఈ ప్రక్రియను ఆలస్యం చేస్తే గడువు ముగిసే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, LPG e-KYC ప్రక్రియను మార్చి 31, 2026 లోపు పూర్తి చేయాలి. అందువల్ల, గ్యాస్ సబ్సిడీ లేదా సిలిండర్ బుకింగ్‌కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఈ గడువులోపు e-KYCను పూర్తి చేయడం మంచిది.

Advertisement