LPG : గ్యాస్ సిలిండర్ బుక్ చేశారా? ఇలా చేస్తే వెంటనే డెలివరీ
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్ (LPG) సరఫరాపై కొందరు వినియోగదారుల్లో ఆందోళన కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల సరఫరా ఆలస్యమవుతుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో సిలిండర్ దొరుకుతుందా లేదా అనే సందేహంతో చాలా మంది ముందుగానే బుకింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే దేశీయ LPG సరఫరాపై ఎలాంటి సమస్యలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సాధారణ వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సరిపడా నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అందువల్ల సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం సూచిస్తోంది.
వివరాలు
బుకింగ్ గడువు పెంపు
దేశంలో గ్యాస్ సిలిండర్ బుకింగ్‌కు సంబంధించిన గడువును ఇటీవల పెంచారు. ముందుగా 21 రోజులు ఉండగా ఇప్పుడు 25 రోజులకు పొడిగించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ గడువును 45 రోజుల వరకు పెంచిన విషయం తెలిసిందే. అయితే కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ డీలర్లు సిలిండర్ డెలివరీ ఆలస్యం చేస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. మరికొన్ని చోట్ల అదనపు రుసుములు అడుగుతున్నారని వినియోగదారులు చెబుతున్నారు.
వివరాలు
సిలిండర్ ఆలస్యమైతే ఫిర్యాదు చేయండిలా
మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నప్పటికీ సకాలంలో డెలివరీ కాకపోతే నేరుగా సంబంధిత గ్యాస్ కంపెనీ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయవచ్చు. టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేస్తే అక్కడి సిబ్బంది మీ బుకింగ్ వివరాలను పరిశీలించి త్వరగా సిలిండర్ డెలివరీ అయ్యేలా చర్యలు తీసుకుంటారు. మీరు బుక్ చేసిన తేదీ, సమయాన్ని బట్టి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. డీలర్ సహకరించకపోతే కూడా వినియోగదారులు కింది నంబర్లకు ఫిర్యాదు చేయాలని గ్యాస్ ఏజెన్సీలు సూచిస్తున్నాయి.
వివరాలు
HP గ్యాస్ హెల్ప్‌లైన్
HP గ్యాస్ వినియోగదారులు ఫిర్యాదులు లేదా వివరాల కోసం ఈ నంబర్లను సంప్రదించవచ్చు. 1800-2333-555 (టోల్ ఫ్రీ) 9493602222 (బుకింగ్)
వివరాలు
భారత్ గ్యాస్ హెల్ప్‌లైన్
సిలిండర్ డెలివరీ ఆలస్యం లేదా డీలర్‌పై ఫిర్యాదు చేయాలనుకుంటే భారత్ గ్యాస్ వినియోగదారులు ఈ నంబర్లకు కాల్ చేయవచ్చు. 1800-22-4344 (టోల్ ఫ్రీ) 7715012345 (LPG బుకింగ్)
వివరాలు
ఇండేన్ గ్యాస్ హెల్ప్‌లైన్
ఇండేన్ గ్యాస్ వినియోగదారులు బుకింగ్, ఫిర్యాదుల కోసం ఈ నంబర్లను ఉపయోగించవచ్చు. 1800-2333-555 (టోల్ ఫ్రీ) 7718955555 (బుకింగ్, ఫిర్యాదు)