LOADING...
Manufacturing PMI: దూకుడు పెంచిన మాన్యుఫాక్చరింగ్‌.. ఆగస్టులో 17 ఏళ్ల గరిష్టానికి భారత్‌ తయారీ రంగం
దూకుడు పెంచిన మాన్యుఫాక్చరింగ్‌.. ఆగస్టులో 17 ఏళ్ల గరిష్టానికి భారత్‌ తయారీ రంగం

Manufacturing PMI: దూకుడు పెంచిన మాన్యుఫాక్చరింగ్‌.. ఆగస్టులో 17 ఏళ్ల గరిష్టానికి భారత్‌ తయారీ రంగం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 01, 2025
03:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత తయారీ రంగం ఆగస్టులో మరింత ఊపందుకుంది. డిమాండ్ పెరగడంతో పాటు ఉత్పత్తి, ఉద్యోగావకాశాలు, వ్యాపార విశ్వాసం బలపడటంతో దేశ మాన్యుఫాక్చరింగ్‌ పర్చేసింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (PMI) 17 ఏళ్ల గరిష్టానికి చేరింది. HSBC ఇండియా మాన్యుఫాక్చరింగ్‌ PMI జూలైలో 59.1గా ఉండగా, ఆగస్టులో 59.3కి పెరిగింది. ఇది 2008 ఫిబ్రవరి తర్వాత ఆపరేటింగ్‌ కండీషన్లలో కనిపించిన అత్యుత్తమ పురోగతిగా రిపోర్ట్‌లో పేర్కొన్నారు. సాధారణంగా 50 మార్క్‌ పైగా ఉంటే వృద్ధి, దాని కంటే తక్కువగా ఉంటే క్షీణతగా పరిగణిస్తారు.

Details

డిమాండ్‌ కారణంగా ఉత్పత్తి పెరిగింది 

కొత్త ఆర్డర్లు, ప్రొడక్షన్‌ పెరుగుదలతో తయారీదారులు ఇన్‌పుట్‌ మెటీరియల్స్‌ కొనుగోళ్లు, ఉద్యోగ నియామకాలను పెంచారు. అదనపు ముడి పదార్థాల కొనుగోలు వేగం పెరిగింది. కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. భవిష్యత్‌ వృద్ధి ఆశాజనకంగా ఉందని ఇది సూచిస్తోందని రిపోర్ట్‌ తెలిపింది. HSBC విశ్లేషణ తయారీ రంగంలో ఊపందుకోవడానికి ప్రధాన కారణం ప్రొడక్షన్‌ వేగవంతం కావడమే అని HSBC ఇండియా చీఫ్‌ ఎకనామిస్ట్‌ ప్రాంజుల్‌ భండారి పేర్కొన్నారు. అయితే అమెరికా తాజాగా భారత వస్తువులపై 50% టారిఫ్‌లు పెంచడం ఎగుమతి ఆర్డర్లపై ప్రభావం చూపిందని ఆమె తెలిపారు.

Details

ఎగుమతులపై ఒత్తిడి 

ఎగుమతి ఆర్డర్లు ఐదు నెలలలో కనిష్ఠ వృద్ధిని నమోదు చేశాయి. అయినప్పటికీ ఆసియా, యూరప్‌, మధ్యప్రాచ్యం, అమెరికా నుండి కొత్త ఆర్డర్లు రావడం కొనసాగింది. ఉద్యోగాలు పెరిగినా వేగం తగ్గింది ఉద్యోగాల వృద్ధి వరుసగా 18వ నెల కొనసాగింది. అయితే జాబ్‌ క్రియేషన్‌ గత సంవత్సరం నవంబర్‌ తర్వాత కనిష్ఠ స్థాయికి చేరింది. అయినప్పటికీ దీర్ఘకాల సగటుతో పోల్చితే ఇది బలంగానే ఉందని రిపోర్ట్‌ చెబుతోంది.

Details

ధరల కారణంగా ఒత్తిడి పెరిగింది 

బేరింగ్స్‌, లెదర్‌, మినరల్స్‌, స్టీల్‌, ఎలక్ట్రానిక్‌ భాగాల ధరలు పెరగడంతో ఇన్‌పుట్‌, అవుట్‌పుట్‌ ఖర్చులు మూడు నెలల గరిష్టానికి చేరాయి. అయితే బలమైన డిమాండ్‌ కారణంగా సంస్థలు అమ్మక ధరలను పెంచి ఖర్చుల భారాన్ని వినియోగదారులపైకి మోపగలిగాయి. బిజినెస్‌ కాన్ఫిడెన్స్‌ పుంజుకుంది కొనుగోలు కార్యకలాపాలు 16 నెలలలో వేగవంతమైన స్థాయిలో జరిగాయి. జూలైలో మూడు ఏళ్ల కనిష్ఠానికి చేరిన బిజినెస్‌ కాన్ఫిడెన్స్‌ ఆగస్టులో తిరిగి పుంజుకుంది. అయితే అమెరికా టారిఫ్‌లపై అనిశ్చితి ఇంకా సవాలుగానే ఉంది.