తదుపరి వార్తా కథనం

Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 25200పైగా నమోదైన నిఫ్టీ
వ్రాసిన వారు
Sirish Praharaju
Sep 22, 2025
04:05 pm
ఈ వార్తాకథనం ఏంటి
స్వల్ప నష్టాలతో సోమవారం ఉదయం ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ ముగిసే సమయానికి మార్కెట్లు భారీ నష్టాలను నమోదు చేసుకున్నాయి. సెన్సెక్స్ 466.26 పాయింట్లు,అంటే 0.56 శాతం నష్టంతో 82,159.97 వద్ద ముగిసింది. అదే సమయంలో నిఫ్టీ 125.50పాయింట్లు లేదా 0.50శాతం నష్టంతో 25,201.55 వద్ద నిలిచింది. టాప్ గెయినర్స్ జాబితాలో ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, అదానీ పవర్,అదానీ టోటల్ గ్యాస్,శ్రీ పుష్కర్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్, కెమ్కాన్ స్పెషాలిటీ కెమికల్స్ వంటి కంపెనీలు ఉన్నాయి. మరోవైపు, సందూర్ మాంగనీస్ అండ్ ఐరన్ ఓరెస్, కెరీర్ పాయింట్ ఎడ్యుటెక్ లిమిటెడ్, ఇన్ఫోబీన్స్ టెక్నాలజీస్, డీఆర్సీ సిస్టమ్స్ ఇండియా, క్రిజాక్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చోటు చేసుకున్నాయి.