LOADING...
Stock market: నష్టాలలో దేశీయ మార్కెట్ సూచీలు .. అదానీ షేర్లు ₹46 వేల కోట్లు జంప్‌ 
నష్టాలలో దేశీయ మార్కెట్ సూచీలు .. అదానీ షేర్లు ₹46 వేల కోట్లు జంప్

Stock market: నష్టాలలో దేశీయ మార్కెట్ సూచీలు .. అదానీ షేర్లు ₹46 వేల కోట్లు జంప్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 19, 2025
04:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిసాయి. ఇటీవల,ఫెడ్ రేట్ కట్‌, అమెరికాతో వాణిజ్య చర్చల ప్రభావంతో సూచీలు వరుస లాభాలు సాధించగా,వారాంతంలో మదుపర్లు గరిష్ఠాల వద్ద లాభాలను స్వీకరించేందుకు ముందుకొచ్చారు. ముఖ్యంగా ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ప్రైవేట్ బ్యాంక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించడంతో సూచీల మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌పడింది. సెన్సెక్స్ ఉదయం 82,946.04 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు 83,013.96) నష్టాల్లో ప్రారంభమై, రోజంతా నష్టాలను చూపుతూ కొనసాగింది. ఇంట్రాడేలో 82,485.92 వద్ద కనిష్టాన్ని తాకిన సెన్సెక్స్,చివరికి 387.73 పాయింట్ల నష్టంతో 82,626.23 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 96.55 పాయింట్ల నష్టంతో 25,327.05 వద్ద ముగిసింది. ఈ సందర్భంగా డాలరుతో రూపాయి మారకం విలువ 88.11 వద్ద ఉంది.

వివరాలు 

బ్రెంట్ క్రూడ్ బారెల్ ధర 66.90 డాలర్లు 

సెన్సెక్స్ 30 సూచీ లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, ట్రెంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రధానంగా నష్టపోయాయి. అదే సమయంలో అదానీ పోర్ట్స్, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ షేర్లు లాభంలో కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బారెల్ ధర 66.90 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా, బంగారం ఔన్సు ధర 3,658 డాలర్ల వద్ద ఉంది.

వివరాలు 

రాణించిన అదానీ షేర్లు 

హిండెన్‌బర్గ్ ఆరోపణలకు పట్టు కనబరచిన ఆధారాలేమీ లేనని సెబీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, అదానీ గ్రూప్ షేర్లు భారీగా పరిగెత్తాయి. ఒక్క రోజులోనే గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ.46 వేల కోట్లు పెరిగి రూ.13.8 లక్షల కోట్లకు చేరింది. అదానీ పవర్ 13 శాతం లాభంతో అగ్రస్థానంలో నిలిచింది. అదానీ టోటల్ గ్యాస్ 7 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ మరియు అదానీ గ్రీన్ ఎనర్జీ 5 శాతం లాభపడ్డాయి.