Page Loader
రూ.1.28 లక్షల కోట్ల నష్టంతో భారతదేశపు అగ్రశేణి కంపెనీలు
రూ.1.28 లక్షల కోట్ల నష్టంతో భారతదేశపు అగ్రశేణి కంపెనీలు

రూ.1.28 లక్షల కోట్ల నష్టంతో భారతదేశపు అగ్రశేణి కంపెనీలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 04, 2024
02:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలోని టాప్ 10 కంపెనీలు ఎనిమిది గత వారం మార్కెట్ క్యాపిటలైజేషన్ (Mcap)లో గణనీయమైన క్షీణతను చవిచూశాయి. ఫలితంగా ఈ కంపెనీలన్నీ కలిపి మొత్తం రూ.1.28 లక్షల కోట్లు నష్టపోయాయి. ఈ క్షీణత ప్రధానంగా ఐటీ దిగ్గజాలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్‌లపై ప్రభావం చూపింది . TCS విలువ ఈ వారం రూ.37,971.83 కోట్లు తగ్గి రూ. 15.5 లక్షల కోట్లకు చేరుకుంది. TCS తర్వాత స్థానంలో ఇన్ఫోసిస్ ఉంది. ఇది రూ.23,811.88 కోట్లు క్షీణించి రూ.7.56 లక్షల కోట్లకు చేరుకుంది.

Details

ఎస్‌బీఐ షేర్లు పతనమయ్యాయి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలువ గత వారం రూ.13,431.54 కోట్లు తగ్గి రూ. 7.57 లక్షల కోట్లకు చేరుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ గత వారం వాల్యుయేషన్ రూ.13,125.49 కోట్లు తగ్గి రూ.20.29 లక్షల కోట్లకు పడిపోయింది. భారతీయ ఎయిర్‌టెల్ రూ.11,821.5 కోట్లు తగ్గి ₹8.50 లక్షల కోట్లకు, ఐసిఐసిఐ బ్యాంక్ రూ.7,843.75 కోట్లు తగ్గి రూ.8.42 లక్షల కోట్లకు చేరాయి. హిందుస్థాన్ యూనిలీవర్ గత వారం రూ.4,288 కోట్ల విలువ కోల్పోయి రూ.6.33 లక్షల కోట్లకు చేరుకుంది. మరోవైపు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌, ఎల్‌ఐసి వృద్ధిని నమోదు చేయడం గమనార్హం.