LOADING...
Stock market: వరుసగా రెండో రోజు క్షీణించిన మార్కెట్లు.. సెన్సెక్స్ 850 పాయింట్లు పతనం
వరుసగా రెండో రోజు క్షీణించిన మార్కెట్లు.. సెన్సెక్స్ 850 పాయింట్లు పతనం

Stock market: వరుసగా రెండో రోజు క్షీణించిన మార్కెట్లు.. సెన్సెక్స్ 850 పాయింట్లు పతనం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 24, 2026
10:02 am

ఈ వార్తాకథనం ఏంటి

వరుసగా రెండో రోజు భారత స్టాక్‌ మార్కెట్ నష్టాల్లో ముగిశాయి. బిఎస్ఇ సెన్సెక్స్ గురువారం 852 పాయింట్లు పడిపోయి 77,664 వద్ద ముగియగా, ఇంట్రాడేలో గరిష్టంగా 942 పాయింట్లు క్షీణించి 77,574 స్థాయికి చేరింది. నిఫ్టి 50 కూడా 205 పాయింట్లు తగ్గి 24,173 వద్ద క్లోజ్‌ అయింది. ఇరాన్-అమెరికా చర్చలు నిలిచిపోవడం వల్ల క్రూడ్‌ ఆయిల్‌ ధరలు మళ్లీ బ్యారెల్‌కు 100 డాలర్లను దాటడం మార్కెట్‌పై ప్రభావం చూపింది. బ్రెంట్ క్రూడ్ గురువారం 1.89% పెరిగి 103.8 డాలర్ల వద్ద ట్రేడ్‌ అయింది. ఇదే సమయంలో విదేశీ పెట్టుబడిదారుల విక్రయాలు పెరగడం, ఆసియా-యూరప్‌ మార్కెట్లు నష్టాల్లో ఉండటం కూడా భారత మార్కెట్ల పతనానికి దారితీశాయి.

వివరాలు

లాభాల్లో  భారతి ఎయిర్‌టెల్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు

సెన్సెక్స్‌లో ట్రెంట్ లిమిటెడ్, బజాజ్ ఫిన్‌సర్వ్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. మరోవైపు అదానీ పోర్ట్స్, లార్సెన్ & టూబ్రో, సన్ ఫార్మా, భారతి ఎయిర్‌టెల్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు లాభాల్లో నిలిచాయి. రంగాల వారీగా చూస్తే పీఎస్‌యూ బ్యాంకింగ్‌, ఆటో, రియల్టీ, కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ రంగాలు భారీగా పడిపోయాయి. అయితే హెల్త్‌కేర్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, పవర్‌ రంగాలు మాత్రం లాభాల్లో కొనసాగాయి.

వివరాలు

రూపాయి పతనం కొనసాగుతుంది

డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి వరుసగా నాలుగో రోజూ బలహీనపడింది. గురువారం 23 పైసలు తగ్గి 94.01 వద్ద ముగిసింది. హార్మూజ్‌ జలసంధి పరిణామాలు, పెరుగుతున్న క్రూడ్‌ ధరలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ రూపాయి పతనానికి కారణమయ్యాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) బుధవారం నికరంగా సుమారు రూ.2,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, గురువారం మరో రూ.3,250 కోట్ల మేర అమ్మకాలు జరిపారు.

Advertisement