LOADING...
Stock Market: కేంద్ర బడ్జెట్ ముందు మార్కెట్లు ఫ్లాట్.. సెన్సెక్స్ 25 పాయింట్లు లాభం, నిఫ్టీ 15 పాయింట్లు నష్టం
కేంద్ర బడ్జెట్ ముందు మార్కెట్లు ఫ్లాట్.. సెన్సెక్స్ 25 పాయింట్లు లాభం, నిఫ్టీ 15 పాయింట్లు నష్టం

Stock Market: కేంద్ర బడ్జెట్ ముందు మార్కెట్లు ఫ్లాట్.. సెన్సెక్స్ 25 పాయింట్లు లాభం, నిఫ్టీ 15 పాయింట్లు నష్టం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 01, 2026
10:20 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ ఆదివారం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. దేశం మొత్తం కేంద్ర బడ్జెట్‌ను ఎదురుచూస్తున్న సమయానికి మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఉదయం 9.35 గంటలకు సెన్సెక్స్ 25 పాయింట్ల లాభంతో 82,294 వద్ద ట్రేడవుతోంది, అలాగే నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో 25,303 వద్ద కదలాడుతోంది. మదుపర్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో పలు కీలక నిర్ణయాలను ప్రకటించనున్నారని అంచనా వేసి ఆర్థిక వ్యూహాలను ఏర్పరిస్తున్నారు.

Details

నష్టాలతో ప్రారంభమైన టాటా స్టీల్, ఇన్ఫోసిస్

నిఫ్టీ సూచీలో సన్‌ఫార్మా, బజాజ్ ఆటో, భారత్ ఎలక్ట్రానిక్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. దాంతోపాటు హిందాల్కో, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, కోల్ ఇండియా షేర్లు నష్టంతో ప్రారంభమయ్యాయి. బడ్జెట్‌ నేపథ్యంలో, ఆదివారం అయినప్పటికీ దేశీయ మార్కెట్లు పనిచేస్తున్నాయి, మదుపర్లు జాగ్రత్తగా పరిస్థితులను గమనిస్తూ, వ్యూహాత్మక నిర్ణయాలను తీసుకుంటున్నారు.

Advertisement