Stock Market: నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్లు.. లాభాల్లోకి నిఫ్టీ, సెన్సెక్స్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ప్రారంభంలో నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించినప్పటికీ, కొద్ది సేపటికే పుంజుకుని లాభాల బాట పట్టాయి. ఉదయం 09:48 గంటల సమయానికి నిఫ్టీ 16.20 పాయింట్లు పెరిగి 24,119.10 స్థాయికి చేరుకోగా, సెన్సెక్స్ 35.18 పాయింట్లు ఎగబాకి 77,129.25 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ-50 సూచీలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి.
వివరాలు
లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు
ఈ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. విస్తృత మార్కెట్లలో కూడా సానుకూల ధోరణి కనిపించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 0.15 శాతం లాభపడగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ సూచీ 0.21 శాతం మేర పెరిగింది. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మెటల్ సూచీలు ఒత్తిడికి లోనై నష్టాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ హెల్త్‌కేర్ సూచీలు లాభాల్లో ట్రేడవుతూ మార్కెట్‌కు మద్దతునిస్తున్నాయి.