Page Loader
Meesho: 'మీషో' ఉద్యోగులకు 9 రోజులు వేతనంతో కూడిన సెలవులు..' ల్యాప్‌టాప్‌లు,ఇమెయిల్‌లు,సమావేశాలు లేవు' 
'మీషో' ఉద్యోగులకు 9 రోజులు వేతనంతో కూడిన సెలవులు..'

Meesho: 'మీషో' ఉద్యోగులకు 9 రోజులు వేతనంతో కూడిన సెలవులు..' ల్యాప్‌టాప్‌లు,ఇమెయిల్‌లు,సమావేశాలు లేవు' 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 10, 2024
04:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో (Meesho) తన ఉద్యోగులకు భారీ ఆఫర్ ప్రకటించింది. సంస్థ 9 రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ సెలవులు ఉద్యోగులు విశ్రాంతి తీసుకొని,మళ్లీ ఎనర్జీతో పనిచేయడానికి సహాయపడతాయని తెలిపారు. ఈ విషయాన్ని మీషో సంస్థ సామాజిక మాధ్యమాల వేదిక ద్వారా ప్రకటించింది. వరుసగా నాలుగో ఏడాదిగా ఈ తరహా విశ్రాంతి అందించడం జరుగుతోంది. "9 రోజుల పాటు ల్యాప్‌టాప్‌లు ఉండవు.ఈ సమయంలో ఎలాంటి మెయిల్స్ రావు.స్టాండప్ కాల్స్ ఉండవు.ఉద్యోగానికి సంబంధించి ఏ పని ఉండదు. ఈ 'రెస్ట్ & రీఛార్జ్' బ్రేక్ అక్టోబర్ 26 నుంచి నవంబర్ 3 వరకు కొనసాగుతుంది.

వివరాలు 

సరికొత్త శక్తిని కూడదీసుకునేందుకు ఈ బ్రేక్‌ అవసరం:మీషో 

మా మెగా బ్లాక్‌బస్టర్ సేల్‌ తర్వాత, పూర్తిగా విశ్రాంతి తీసుకొని, మాపై మేం దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. కొత్త సంవత్సరానికి సరికొత్త శక్తిని కూడదీసుకునేందుకు ఈ బ్రేక్‌ అవసరం" అని మీషో సంస్థ వివరించింది. ఈ ప్రకటనపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. ఈ విధానం ఎంతో సంతోషాన్నిఇస్తోందంటూ వారు ప్రశంసించారు. సిబ్బంది మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంత విలువ ఇస్తున్నారో దీనిని బట్టి తెలుస్తోందని మరికొందరు వ్యాఖ్యలు చేశారు.