Bank Merger: ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ విలీనం.. షేర్ హోల్డర్లకు కొత్త షేర్ల పంపిణీ
ఈ వార్తాకథనం ఏంటి
కొద్ది రోజుల క్రితం దేశంలో ప్రముఖ ఆర్థిక సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, అత్యంత పెద్ద ప్రైవేట్ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో విలీనమైన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఐడీఎఫ్‌సీ లిమిటెడ్ కూడా విలీనానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఐసీఐసీఐ లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంకులో విలీనమైంది.
ఇప్పుడు ఐడీఎఫ్‌సీ లిమిటెడ్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో విలీనం అవ్వాలని నిర్ణయించుకుంది.
ఈ విలీనం ప్రారంభానికి రిజర్వ్ బ్యాంక్ ఆమోదం పొందిన తరువాత బ్యాంక్ వాటాదారులు, షేర్ హోల్డర్ల అనుమతులు కూడా లభించాయి.
తాజా సమాచారం ప్రకారం ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ అక్టోబర్ 1 నుంచి ఈ విలీన ప్రక్రియ అమలవుతుందని స్పష్టం చేసింది.
Details
ఐడీఎఫ్‌సీ లిమిటెడ్ షేర్ హోల్డర్లకు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు
సెప్టెంబర్ 27న ఐడీఎఫ్‌సీ లిమిటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విలీనానికి అనుమతి ఇచ్చినట్లు ప్రకటించింది.
మొదట ఐడీఎఫ్‌సీ ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ లిమిటెడ్, ఐడీఎఫ్‌సీ లిమిటెడ్‌లో విలీనమవుతుంది. ఇది సెప్టెంబర్ 30 నుంచి అమలులోకి రానుంది.
ఆ తర్వాత ఐడీఎఫ్‌సీ లిమిటెడ్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులో అక్టోబర్ 1 నుంచి విలీనం అవుతుంది.
ఈ విలీనంతో ఐడీఎఫ్‌సీ లిమిటెడ్ షేర్ హోల్డర్లకు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు ఇచ్చారు.
ప్రత్యేకంగా రూ. 10 విలువ ఉన్న ప్రతి 100 ఐడీఎఫ్‌సీ లిమిటెడ్ షేర్లకు, రూ. 10 విలువ ఉన్న 155 ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు అందిస్తారు.
షేర్ల అలాట్‌మెంట్‌కి 2024, అక్టోబర్ 10న రికార్డ్ డేట్ గా ప్రకటించారు.
Details
డైరెక్టర్లు, మేనేజ్‌మెంట్ లో ఎలాంటి మార్పులుండవు
ఈ విలీనానికి సంబంధించి, IDFC ఫస్ట్ బ్యాంక్‌లో డైరెక్టర్లు లేదా మేనేజ్‌మెంట్‌లో ఎలాంటి మార్పులు జరగవు.
ఐడీఎఫ్‌సీ లిమిటెడ్, ఐడీఎఫ్‌సీ ఎఫ్‌హెచ్‌సీఎల్ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను ఆర్బీఐ రద్దు చేసే ప్రక్రియ ప్రారంభమైంది.
చెన్నై బెంచ్ ఆఫ్ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఆదేశాల ప్రకారం, 2024, మే 17న ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ మెజార్టీ షేర్ హోల్డర్లు ఈ విలీనానికి ఆమోదం తెలిపారు.
అక్టోబర్ 17న కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి కూడా అనుమతి పొందాల్సి ఉంది. జులై 3న జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.