ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో 4వేల ఉద్యోగాల కోతకు 'మెటా' సన్నద్ధం
సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' బుధవారం నుంచి కంపెనీ వ్యాప్తంగా మరో దఫా ఉద్యోగాలను తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఉద్యోగాల కోతలకు సిద్ధం కావాలని ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా నిర్వాహకులకు తెలియజేసింది. కంపెనీలో 10,000మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు మార్క్ జూకర్ బర్గ్ మార్చిలోనే ప్రకటించారు. అందులో భాగంగా తొలి దఫాలో 4వేల మందిని తొలగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులను మెటా తొలగిస్తోంది.
ఏప్రిల్ చివరిలో, మే నెలలో 10వేల మంది తొలగింపు
మొత్తం రెండు దఫాలుగా 10వేల మందిని ఉద్యోగులను మెటా తొలగించనుంది. ఏప్రిల్ చివరిలో సాంకేతిక బృందాలపై ఉద్యోగాల కోత ఎఫెక్ట్ ఉంటుందని, మే చివరిలో సహాయక ఉద్యోగులపై లేఆఫ్ ప్రభావం ఉంటుందని గతంలోనే జుకర్‌బర్గ్ చెప్పారు. నవంబర్‌లో మెటా ఇప్పటికే దాదాపు 11,000 ఉద్యోగాలను తగ్గించింది. ఈ ఏడాది కంపెనీని మరింత సమర్థవంతంగా నిర్వహించాలని జుకర్‌బర్గ్ లక్ష్యాంగా పెట్టుకున్నారు. అందుకే ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, రియాలిటీ ల్యాబ్‌లలోని ఉద్యోగులు లేఆఫ్‌లలో బలవుతున్నారు. కంపెనీ ఎదుగుదలకు సహకరించిన స్నేహితులు, సహోద్యోగులకు తాము వీడ్కోలు పలుకుతున్నందున ఇది చాలా కష్టమైన సమయం అవుతుందని, మెటా మానవ వనరుల అధిపతి లోరీ గోలెర్ ఒక మెమోలో రాశారు.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి