Page Loader
Meta: మెటాలో డేటా లీక్‌ కలకలం.. ఉద్యోగులను తొలగించిన సంస్థ
మెటాలో డేటా లీక్‌ కలకలం.. ఉద్యోగులను తొలగించిన సంస్థ

Meta: మెటాలో డేటా లీక్‌ కలకలం.. ఉద్యోగులను తొలగించిన సంస్థ

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 28, 2025
02:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెటా సంస్థ ఇటీవల కొంతమంది ఉద్యోగులను తొలగించింది. ముఖ్యమైన కంపెనీ సమాచారం మీడియాకు చేరిన కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. మార్క్‌ జుకర్‌బర్గ్‌ నేతృత్వంలోని ఈ టెక్‌ దిగ్గజం, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఒత్తిడిని ఎదుర్కొంటూనే, అంతర్గత డేటా లీక్‌లను అరికట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా నిర్వహించిన దర్యాప్తులో కొంతమంది ఉద్యోగులు సంస్థకు చెందిన సమాచారాన్ని బహిర్గతం చేసినట్లు తేలిందని మెటా ప్రకటించింది. దీనితో దాదాపు 20 మందిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు స్పష్టంచేసింది. లీక్‌ చేసినవారిలో మరింత మంది ఉండే అవకాశం ఉందని కూడా వెల్లడించింది.

Details

సంస్థ విధానాలకు వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు

సంస్థ విధానాలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. మెటా ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ ఏ కారణంతోనైనా కంపెనీ అంతర్గత సమాచారాన్ని లీక్‌ చేయడం మా పాలసీకి విరుద్ధం. ఉద్యోగులు సంస్థలో చేరినప్పుడే దీనిని స్పష్టం చేస్తాం. దీనిని పునరుద్ఘాటిస్తూ వారికి గుర్తు చేస్తూనే ఉంటామని వివరించారు. జుకర్‌బర్గ్‌ ఇటీవల నిర్వహించిన సమావేశాల అనంతరం ఈ తొలగింపుల ప్రకటన రావడం గమనార్హం. అయితే ఏ సమాచారం బహిర్గతమైందనే విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు. మరోవైపు మెటా తన వ్యాపార కార్యకలాపాల్లో పలు మార్పులు తీసుకొస్తోంది. వ్యూహాత్మక దృష్టిలో భాగంగా కంటెంట్ పాలసీలలో మార్పులు చేస్తూనే, తక్కువ పనితీరు చూపిన ఉద్యోగులను కూడా తొలగిస్తోంది.