Microsoft: టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగాల కోత.. వివిధ విభాగాల్లో పని చేస్తున్న వాళ్లలో 1 శాతం కంటే తక్కువమందిని ఇంటికి
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త ఏడాది ప్రారంభమైన వెంటనే ఉద్యోగాల కోతలు మొదలయ్యాయి.
ఇటీవల వరకు మాంద్యం భయాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావాన్ని ఆధారంగా చూపుతూ ఖర్చులు తగ్గించుకునేందుకు కొన్ని సంస్థలు ఉద్యోగులను ఉద్వాసన పలికాయి.
ఇప్పుడు, ప్రతిభ లేని వారికి ఉద్యోగం నుంచి తొలగింపులు ప్రారంభమయ్యాయి.
ఈ తరహా చర్యల్లో భాగంగా ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల తొలగింపును చేపట్టనుంది.
వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై ఈ ప్రభావం పడుతుందని సమాచారం. మైక్రోసాఫ్ట్ ప్రతినిధి ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు ఆంగ్ల మీడియా కథనాల్లో పేర్కొంది.
వివరాలు
మొత్తం ఉద్యోగుల్లో 1 శాతం కన్నా తక్కువ మందిపై ప్రభావం
''మైక్రోసాఫ్ట్‌లో ప్రతిభావంతమైన ఉద్యోగులను ప్రోత్సహించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము. కొత్త విషయాలు నేర్చుకునే, అభివృద్ధి చెందే ఆలోచన కలిగిన వారిని మేము ఆదరిస్తాము. అయితే, పనితీరు లోపించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటాము,'' అని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి తెలిపారు.
మెరుగైన పనితీరు చేసే వారి సంఖ్యను పెంచేందుకు సంస్థ విస్తృతమైన ప్రయత్నాల్లో భాగంగా ఈ లేఆఫ్ నిర్ణయం తీసుకుంది.
ఈ చర్య సంస్థలో ఉన్న మొత్తం ఉద్యోగుల్లో 1 శాతం కన్నా తక్కువ మందిపై ప్రభావం చూపనుంది.
వివరాలు
2023లో 10,000 మంది ఉద్యోగులను తొలగించింది
మైక్రోసాఫ్ట్ లేఆఫ్‌లను ప్రకటించడం ఇదేం తొలిసారి కాదు. 2023లో కంపెనీ సుమారు 10,000 మంది ఉద్యోగులను తొలగించింది, ఇది సంస్థ మొత్తం శ్రామికశక్తిలో 5 శాతం.
గతేడాది గేమింగ్ విభాగంలో మాత్రమే దాదాపు 2,000 మంది ఉద్యోగులను ఉద్వాసన పలికింది.
ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఈ ఏడాదిలోనూ లేఆఫ్‌లు చేపట్టే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.